By: ABP Desam | Updated at : 03 Aug 2022 04:43 PM (IST)
విద్యార్థుల మిస్సింగ్ కేసులో షాకింగ్ విషయాలు, సినిమా పిచ్చితోనే చెన్నైకి మకాం!
కృష్ణా జిల్లాలో కలకలం రేపిన విద్యార్థినుల అదృశ్యం కేసులో పోలీసులకు లీడ్ దొరికింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గం కంకిపాడు జడ్పీ హైస్కూల్‌లో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల జాడను పోలీసులు కనిపెట్టారు. వీరిద్దరూ ప్రస్తుతం చెన్నైలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులు అదృశ్యమైనట్టు మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. చివరకు ఈ విద్యార్థులు సినిమా పిచ్చితోనే ఇంటి నుంచి పారిపోయినట్లు తేల్చారు. అయితే ఈ అమ్మాయిలు సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. తమ పిల్లలు మిస్సైనట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లలకు ఏమైందోనంటూ ఏడుస్తూనే ఉన్నారు.
గుండి జోజి అనే వ్యక్తే అమ్మాయిలిద్దరినీ తీసుకెళ్లాడు..
ఎలాగైనా సరే తమ పిల్లలను వెతికి సరక్షితంగా తమకు అప్పగించాలంటూ పోలీసులను వేడుకున్నారు. ఈ క్రమంలోనే ముందు నుంచి పోలీసులు అనుమానించినట్లుగా అదే గ్రామానికి చెందిన గుండి జోజి అనే వ్యక్తే వీరిని తీసుకెళ్లినట్లు తేలింది. అయితే ఆ అమ్మాయిల ఇద్దరికీ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లినట్లు పోలీసులు గుుర్తించారు. మిస్సైన విద్యార్థుల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తున్నాడు. జోజితో పాటు ఇద్దరు విద్యార్థులు చెన్నైలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
జోజితో పాటు విద్యార్థినులను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు..
పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లలను గ్రామానికి తీసుకు రావాల్సిందిగా కోరారు. తమ పిల్లలకు మాయ మాటలు చెప్పి చెన్నై తీసుకెళ్లిన జోజిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేవలం అదృశ్యం అయిన అమ్మాయిల తల్లిదండ్రులే కాకుండా గ్రామస్థులంతా కూడా జోజిపై చాలా కోపంగా ఉన్నారు. అతడు గ్రామంలోకి మళ్లీ వచ్చినా అక్కడ ఉండనిచ్చేది లేదని చెప్తున్నారు. ఇలా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్తూ.. భవిష్యత్తులో ఇంకెంత మందిని తీసుకెళ్తాడోనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోజిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
విద్యార్థులతో పాటు జోజిని కంకిపాడు తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
20 బృందాలుగా ఏర్పడి గాలింపు..
విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జోజి కోసం పోలీసులు వాకబు చేయగా.. అతను సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి జన శతాబ్ది ట్రైన్ లో చెన్నై వైపు వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు మొత్తం 20 బృందాలుగా ఏర్పడి విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు.
Vijayawada: విజయవాడలో 9 అంతస్తుల కొత్త బిల్డింగ్, అన్ని కోర్టులు అందులోనే - ప్రారంభించనున్న CJI
Vizag Murders: మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ, నడ్డిరోడ్డుపై రౌడీషీటర్ హత్య!
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !
Crime News : బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !
రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా