By: ABP Desam | Updated at : 31 Mar 2022 03:04 PM (IST)
మహిళను అలా కూడా చంపుతారా? కడపలో ఓ కుటుంబం కిరాతకం - అరెస్ట్ !
వివాహేతర బంధం పెట్టుకుందని ఓ మహిళను ఇంటి నుంచి కిడ్నాప్ చేసుకుని వచ్చారు. కారులో కొట్టుకుంటూ తీసుకు వచ్చారు. ఇంటికి తెచ్చి కుటుంసభ్యులందరూ దాడి చేశారు.చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఘటన కడప జిల్లా పోరుమామిళ్లలో జరిగింది. పోలీసులు వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన షేక్ మున్ని పోరుమామిళ్లలోని ఓ సూపర్ మార్కెట్ లో ఆర్నెల్ల క్రిందట ఉద్యోగంలో చేరింది. అక్కడే పఠాన్ మాబు హుస్సేన్ అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది.ఈ కారణంగా పఠాన్ మాబు హుస్సేన్ కుటుంబంలో కలతలు ప్రారంభమయ్యాయి. మాబు హుస్సేన్ ఇంటికి రావడం లేదని దానికి మున్నీనే కారణం అని భావించారు. మాబు హుస్సేన్ కుటుంబసభ్యులు మున్నీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి చంపేయాలని ప్లాన్ చేశారు. అప్పటికే మున్నీ పోరుమామిళ్ల నుంచి ఇల్లు ఖాళీ చేసి సొంత ఊరు గిద్దలూరుకు వెళ్లిపోయింది.
RRR చూసి ఇంటికి బయల్దేరిన యువకుడు, రెండ్రోజులైనా రాలేదు - కూపీ లాగితే సంచలన విషయాలు, అవాక్కైన పోలీసులు!
మార్చి 28వ తేదీ ఆదివారం రోజున మాబు హుస్సేన్ తండ్రి మహబూబ్ బాషా..తమ కుటుంబానికి సన్నిహితుడైన జిలాని బాషా అనే కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ సయ్యద్ హుస్సేన్ బొజ్జ గురు ప్రసాద్ కారును అద్దెకు తీసుకుని గిద్దలూరు కు వెళ్లి షేక్ మున్నిని బలవంతంగా పోరుమామిళ్ల తీసుకు వచ్చారు. తీసుకొచ్చే క్రమంలో కారులోనే షేక్ మున్ని ని కొట్టారు.ఇంటికి తీసుకు వచ్చాక 12 మంది దాడి చేయడం తో అపస్మారక స్థితికి చేరుకుంది. తర్వాత వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోరుమామిళ్ల, కడపలోని ప్రైవేట్ ఆస్పత్రులకతీసుకెళ్లినా చేర్చుకోలేదు. చివరిగా రిమ్స్ లో మున్ని మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
దొంగగా మారిన పోలీస్, చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టుపడితే చితక్కొట్టేశారు!
పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో షేక్ మున్ని తల్లి షేక్ షకీలా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడి లో పాల్గొన్న మొత్తం 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో బి.కోడూరు, కలసపాడు లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఈ కేసులో 7 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, 21 రోజుల్లో విచారణ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని ఎస్పీ అన్బురాజన్ ప్రకటించారు. వేగవంతమైన దర్యాప్తు కోసంకేసును 'దిశ' పోలీస్ స్టేషన్ కు బదలాయించడం జరిగిందన్నారు. కేసులో నిందితులైన 12 మందిని కఠినంగా శిక్షించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!
Hyderabad Crime : గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడని కత్తితో దాడిచేసిన బాలుడు, రక్తం కారుతుంటే సెల్ఫీ!
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం, ఐసీయూలో చికిత్స
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
KKR Vs LSG Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో - రెండో స్థానం కావాలంటే గెలవాల్సిందే!
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?