Naveen Murder Case : నవీన్ హత్య కేసులో లవర్ నిహారిక అరెస్ట్ - సైకో కిల్లర్ కేసులో కీలక మలుపు !
నవీన్ హత్య కేసులో ప్రియురాలు నీహారిక పాత్రను కూడా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేశారు.
![Naveen Murder Case : నవీన్ హత్య కేసులో లవర్ నిహారిక అరెస్ట్ - సైకో కిల్లర్ కేసులో కీలక మలుపు ! police have also identified the role of girlfriend Neeharika in Naveen's murder case. Arrested. Naveen Murder Case : నవీన్ హత్య కేసులో లవర్ నిహారిక అరెస్ట్ - సైకో కిల్లర్ కేసులో కీలక మలుపు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/06/447a85d7044dccd22359b8d3de728d061678109195958228_original.avif?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Naveen Murder Case : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నవీన్ అనే విద్యార్థి కేసులో పోలీసులు ప్రియురాలు నిహారికను అరెస్ట్ చేశారు. హంతకుడు హరిహరకృష్ణను ఇంతకు ముందే పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు విచారణలో కీలక విషయాలు బయటపడటంతో ప్రియురాలు నిహారికతో పాటు మరో స్నేహితుడు హసన్ ను కూడా అరెస్ట్ చేశారు. నిహారిక, హసన్‌లకు తెలిసే హత్య జరిగిందని... నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రకటించారు. హరిహర కృష్ణ.. నవీన్ ను హత్య చేసిన తర్వాత దారుణంగా శరీర భాగాలను కోసి.. వాటి ఫోటోలను నిహారికకు పంపాడు. ఆ తర్వాత నిహారిక హరిహరకృష్ణుకు రూ. పదిహేను వందలు పంపినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్య విషయం బ యటపడిన తర్వాత నీహారిక వాట్సాప్ చాటింగ్ ను డిలీట్ చేయడమే కాకుండా.. సాక్ష్యాల ట్యాంపరింగ్‌కు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. హత్య ఘటన తర్వాత హరిహర, నిహారిక, హసన్ .. హత్య చేసిన స్థలాన్ని ముగ్గురూ కలిసి చూశారని కూడా పోలీసులు నిర్ధారించారు.
రెండు రోజుల కిందటే నీహారిక పాత్రేమీ లేదని ప్రకటించిన రాచకొండ సీపీ
నవీన్ దారుణహత్యపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ రెండు రోజుల కిందట నిర్వహించినమీడియా సమావేశంలో నిహారికకు అసలు సంబంధం లేదని ప్రకటించారు. విద్యార్థి నవీన్ హత్య కేసులో ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని... నవీన్ హత్య విషయంపై యువతి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రకటించారు. గతంలోనూ తాను ఇదే మాట చెప్పానని, విచారణలో సైతం ఇదే తేలిందన్నారని రాచకొండ సీపీ చెప్పారు. వాట్సాప్ చాటింగ్ లో సైతం నవీన్ హత్యకు సంబంధించి యువతికి విషయాలు తెలుసునని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆమె ఇంకా ఏ బాధలో ఉందో, దుష్ప్రచారంతో ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజుల్లోనే పోలీసులు పూర్తిగా ఆధారాలున్నాయని... హత్య తర్వాత హరిహరకృష్ణకు డబ్బులు కూడా ఇచ్చిందని చెప్పడం సంచలనంగా మారింది. పైగా హత్య ప్రదేశాన్ని కూడా సందర్శించారని తేలింది.
గెట్ టుగెదర్ అని పిలిచి మర్డర్
ఫిబ్రవరి 17న నవీన్‌ను గెట్ టుగెదర్ పేరుతో పిలిచిన హరిహరకృష్ణ ఆ రోజు రాత్రి వరకూ నవీన్ ఉండేలా ప్లాన్ వేశాడు. సాయంత్రం దాటేవరకు నవీన్ ను ఎల్బీనగర్, ఇతర ప్రాంతాల్లో తిప్పాడు. తిరిగి వెళ్లిపోతానని నవీన్ చెప్పడంతో నల్గొండలో దింపుతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు హరిహరకృష్ణ. హయత్ నగర్ దాటాక మద్యం తీసుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ముందే ప్లాన్ చేసుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా మర్డర్ చేశాడు.
విక్రమ్ సినిమాలో మర్డర్ సీన్ చూసి ఇన్ స్పైర్ అయిన హరి హరకృష్ణ
ఇటీవల విక్రమ్ అనే సినిమా చూసిన హరిహర కృష్ణ అందులో చూపించిన హత్యల్ని చూసి బాగా ఇన్ స్పయిర్ అయినట్లుగా గుర్తించారు. విక్రమ్ సిమిమా చూసి హత్య చేసి నట్టు పోలీసులకి వెల్లడించాడు హరి హర కృష్ణ . విక్రమ్ సినిమాలో సీన్లలో ఒక మనిషిని చంపి తలని శరీర భాగలని తొలగించిన సీన్ గురించి వివరించాడు. సాక్ష్యాలు లేకుండా చేయడానికి శరీర భాగాలను సంచిలో వేసికోని వెళ్లి..ప్లాన్ ప్రకారం తగుల పెట్టినట్లుగా హర హరకృష్ణ పోలీసులకు కస్టడీలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)