అన్వేషించండి

Crime News: ఇంటికి డెడ్‌బాడీ పార్శిల్ - అసలు నిందితులు దొరికారు, ఆ క్రైమ్ వెనుక అసలు కథ ఇదే!

Deadbody Parcel: ప.గో జిల్లాలో ఇంటికి పార్శిల్ డోర్ డెలివరీ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఆస్తి కోసమే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఎస్పీ నయీంఅస్మీ తెలిపారు.

Police Arrested Accused In Deadbody Parcel Case: ప.గో జిల్లా (Westgodavari District) ఉండి మండలం యండగండి (Yendagandi) గ్రామంలో ఇంటికి పార్శిల్‌లో మృతదేహం వచ్చిన కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మలను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎస్పీ నయీంఅస్మీ శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న సమాచారం రాగానే దర్యాప్తు ప్రారంభించామని.. పలు కోణాల్లో విచారించి అసలు నిందితులను గుర్తించినట్లు వివరించారు. 'గ్రామానికి చెందిన రంగరాజు కుమార్తెలు తులసి, రేవతిల మధ్య గొడవలు ఉన్నాయి. 2016లో రేవతికి శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. తులసిని భర్త వదిలేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటోంది. రంగరాజుకు 2.5 ఎకరాల పొలం, కొంత స్థలం, బంగారం ఉన్నాయి. ఈ ఆస్తి కోసం కుట్ర పన్నిన వర్మ.. తులసి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ కుట్రలో ఇరికించాలని యత్నించాడు. క్షత్రియ సేవా సమితి పేరిట తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు కొన్నాళ్లు రేవతి, వర్మ నాటకమాడారు. ఈ క్రమంలోనే కొన్ని వస్తువులను శ్రీధర్‌వర్మ పంపారు. ఇందులో భాగంగానే పర్లయ్య మృతదేహం పంపించారు.' అని ఎస్పీ తెలిపారు.

'అమాయకున్ని చంపేశారు'

డెడ్‌బాడీతో తులసిని భయపెట్టి ఆస్తి జోలికి రాకుండా చేయడమే లక్ష్యంగా శ్రీధర్ వర్మ పన్నాగం పన్నినట్లు ఎస్పీ తెలిపారు. 'పర్లయ్యను పట్టించుకునే వారే లేకపోవడంతో ఆయన్ను చంపేశారు. బాగా మద్యం తాగించి సుష్మకి చెందిన పొలానికి తీసుకెళ్లి నైలాన్ తాడుతో కట్టి చంపారు. తొలుత మృతదేహాన్ని చూసి భయపడినా తులసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారించగా శ్రీధర్‌వర్మ నిజం తెలిసింది. నిందితుడిని మచిలీపట్నం సమీపంలో అరెస్ట్ చేశాం. మామ ఆస్తి, అందులో తులసి వాటాపై కన్నేసి నిందితుడు ఈ పథకం రచించాడు. జూన్ నుంచే ఈ తతంగానికి కుట్ర పన్నారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.' అని ఎస్పీ వివరించారు.

సంతకం చేయకుంటే..

చెక్కపెట్టెలో మృతదేహాన్ని చూసిన తులసిని శ్రీధర్‌వర్మ బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆందోళనలో ఉన్న ఆమెతో.. శవం విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటానని.. ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. 'సంతకం పెడతావా లేదా నువ్వూ శవమవుతావా.?' అని ఆమెను బెదిరించినట్లు.. సెల్ ఫోన్ సైతం లాక్కున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తులసి తన దగ్గరున్న మరో ఫోన్‌తో తనకు తెలిసిన వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలపగా అలానే చేసింది.

కారులో పరారీ

కాగా, నిందితుడు శ్రీధర్‌వర్మ తన ప్రియురాలు సుష్మ, తన కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా ముంగినపూడి బీచ్‌కు చేరుకున్నాడు. తర్వతా సమీపంలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకోగా.. పోలీసులు గాలిస్తున్న సమయంలో తమ ప్రాంతానికి ముగ్గురు కొత్త వారు వచ్చారన్న గ్రామస్థుల సమాచారంతో నిందితులను పట్టుకున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు శ్రీధర్‌వర్మ 40కి పైగా సిమ్ కార్డులు ఉపయోగించాడు. అతని ఖాతాలో రూ.2 కోట్లు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు.

Also Read: JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Embed widget