అన్వేషించండి

Warangal Chain Snatcher: సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నిషీయన్ ఉద్యోగం వదిలేసి చైన్ స్నాచర్‌గా మారాడు - నాసిరకం టెక్నిక్‌తో దొరికిపోయాడు !

Warangal Crime News: వరంగల్‌లో సీరియల్ చైన్ స్నాచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చి చైన్ స్నాచింగ్ నే వృత్తిగా చేసుకున్నాడు.

Warangal chain snatcher arrest:  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా  చైన్‌ స్నాచింగ్‌లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని   పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి సూమారు 23లక్షల 50వేల రూపాయల విలువ గల 237 గ్రాముల బంగారు పుస్తెల తాళ్ళు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు, ఒక సెల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్నేహితుడి ఇంట్లో దొంగతనంతో చోరీలు స్టార్ట్ 

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్‌(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్న నిందితుడు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఓ సిమెంట్‌ కంపెనీలో క్వాలిటీ టెక్నీషియన్ హైదరాబాద్‌లో పనిచేసేవాడు ఇదే క్రమంలో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి దానిని  స్థానిక మణిప్పురం గోల్డ్‌ లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసేడు. ఈ సంఘటలో నిందితుడుని స్థానిక నెరెడ్‌మెట్‌ పోలీసులు ఈ ఏడాది అరెస్టు చేసిన జైలుకు తరలించారు.

జైలు నుంచి విడుదలయ్యాక వరంగల్‌లో చైన్ స్నాచింగ్‌లు

బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఎలాంటి మార్పు రాకపోగా తన జల్సాలకు అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రొడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్నాడు.  నిందితుడు ముందుగా చైన్‌ స్నాచింగ్‌ చేసేందుకు  ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్ళి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం పది చైన్‌ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  మూడు, రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, అలాగే సుబేదారి, కాజీపేట,హసన్‌పర్తి, కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్‌ స్నాచింగ్‌ చోరీలకు పాల్పడగా, హన్మకొండ, హసన్‌పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిందితుడు  మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడటం జరిగింది.

ప్రత్యేక బృందాలతో పట్టుకున్న పోలీసులు 

ఈ వరుస చైన్‌ స్నాచింగ్‌ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు  క్రైమ్స్‌, హన్మకొండ ఏసిపిల అధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడుని గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు ఉదయం యాదవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వాహన కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ చేసిన బంగారు గోలుసులను విక్రయించేందుకు అనుమానస్పదంగా చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై   వస్తున్న  నిందితుడుని రొడ్డుపై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిందితుడుని పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన చైన్‌ స్నాచింగ్‌, ద్విచక్ర వాహన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతను నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Case Filed On Veeramachaneni: వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి పేరుతో నమ్మించి ఓయోలో యువతి హత్య
హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి పేరుతో నమ్మించి ఓయోలో యువతి హత్య
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Hyderabad Crime: 'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!
'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget