Crime News : ఉక్రెయిన్‌లో యుద్ధం - ఇక్కడ విజిలెన్స్ వేధింపులు ! ఆత్మహత్య చేసుకున్న కడప ఆయిల్‌మిల్లు యజమాని
విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారంటూ కడపలో ఆయిల్ మిల్లు యజమాని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సూసైడ్ నోట్ లభ్యమయింది.
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణం చెప్పి నూనె వ్యాపారులు రేట్లు పెంచేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఇటీవలి కాలంలో ఏపీలో విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున నూనె మిల్లులపై దాడులు చేస్తున్నారు. అయితే వారు ప్రతీ చిన్న విషయానికి వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు వేధించడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి మరీ ఓ నూనె మిల్లు యజమానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కడపలో జరిగింది.,
ఒక్క గ్రాముతో 20 మందికి కిక్ - ఇంట్లోనే కొత్త రకం డ్రగ్స్ తయారీ, సెటప్ చూసి అవాక్కైన పోలీసులు
కడప పట్టణానికి చెందిన రామకృష్ణారెడ్డి అనేవ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప సమీపంలో పట్టాల మీద ఆయన మృతదేహం లభించింది జేబులో సూసైడ్ నోట్ కూడా లభించింది. విజిలెన్స్ అధికారుల వేధింపులకు ఓ నూనె మిల్లు యజమాని ఆత్మహత్య చేసుకున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కడప పట్టణంలో రామకృష్ణారెడ్డి చాలా కాలంగా నూనెమిల్లు నిర్వహిస్తున్నాడు. ఇటీవల నూనెను బ్లాక్ మార్కెటింగ్ చే్సతున్నారని ఆరోపిస్తూ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తన వద్ద ఎలాంటి అక్రమాలు లేవని చెబుతున్నా.. నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను విజిలెన్స్ అధికారులు నిత్యం వేధిస్తుండడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృత దేహం వద్ద లభించిన సుసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు.
బస్సులో బ్యాగుల నిండా రూ. కోట్ల నగదు - మాదే అని ఎవరు రారేంటి ।?
రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కడప ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు కారకులైన విజిలెన్స్ అధికారులపై కేసు నమోదు చేసేంతవరకు పోస్టుమార్టం చేయవద్దని ఆయిల్ మిల్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. గత రెండు వారాలుగా కడప జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు విస్తృతంగా ఆయిల్ మిల్లుల్లో సోదాలు చేస్తున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. కొన్ని మిల్లులను సీజ్ చేశారు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డికి కూడా వేధింపులు పెరగడంతో విరక్తి పుట్టి ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
రామకృష్ణారెడ్డి ఆత్మహత్య సూసైడ్ లెట్‌పై ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన సూసైడ్ నోట్‌లో రాసినట్లుగా విజిలెన్స్ అధికారులపై కేసులు పెట్టే అవకాశం లేదని భావిస్తున్నారు. కానీ.. విజిలెన్స్ అధికారుల వేధింపులు నిజమేనని .. ఖచ్చితంగా కేసులు పెట్టాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని.. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని వారంటున్నారు.