By: ABP Desam | Updated at : 06 May 2022 04:05 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పెనుగంచిప్రోలులో యువకుడిపై దాడి
NTR District News : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న తుఫాన్ కాలనీలో ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. తన తల్లితో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. డేరంగుల తిరుపతిరావు అనే యువకుడిపై రాజేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గొంతు, కడుపులో కత్తితో పోడవడంతో తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 సహాయంతో పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం యువకుడిని విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజేష్ ను అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.
కుమార్తె లవర్ హత్యకు సుపారీ
ఆయనో మధ్య తరగతి తండ్రి. కుమార్తెకు పెళ్లీడు రాగానే పెళ్లి చేశాడు. కానీ ఆ కుమార్తె దారి తప్పింది. కట్టుకున్న భర్తతో సరిగ్గా కాపురం చేయకుండా ఇతరులతో ప్రేమ వ్యవహారాలు నడిపింది. చాలా సార్లు గొడవలు అయ్యాయి. అయినప్పటికీ అల్లుడికి ఆయన సర్ది చెప్పాడు. కానీ ఈ సారి ఆ కూతురు తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వారం రోజుల పాటు ముంబైలో ఇతర చోట్ల తిరిగేసి.. ఇంటికి తిరిగి వచ్చింది. కానీ భర్త ఇంట్లోకి రానివ్వలేదు. అప్పుడు ఆ తండ్రి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తెను ఏమీ అనలేదు..కానీ తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నవాడ్ని అడ్డు తొలగించాలనుకున్నాడు.కానీ చివరిలో ప్లాన్ అడ్డం తిరిగింది.
సిరిసిల్లకు చెందిన నీలం శ్రీనివాస్ మనోజ్ అనే వ్యక్తిని హత్య చేయడానికి వీరిద్దరికి సుపారీ ఇచ్చాడు. ఎందుకంటే ఆ మనోజ్ శ్రీనివాస్ కుమార్తెతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. పెళ్లి అయిన కుమార్తె కాపురాన్ని ఆయన చెడగొడుతున్నాడని శ్రీనివాస్ కోపం పెంచుకున్నారు. ఇటీవల మనోజ్‌తో కలిసి వారం రోజుల పాటు ఎవరికీ తెలియకుండా ముంబయి వెళ్ళి వచ్చారు. శ్రీనివాస్ కుమార్తె భర్త ఆమెను ఇంట్లోకి రానిచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్ తన స్నేహితుడైన కుంటయ్యతో కలిసి తన కూతురి కాపురం చక్కబెట్టడానికి మనోజ్ హత్యకు పథకం పన్నారు. దీనికి బీహార్ కు చెందిన లఖింద్ర సాహ్ని,బొమ్మడి రాజ్ కుమార్ లతో రూ ఐదు లక్షలకు సుపారీ మర్డర్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మనోజ్ జాతకం బాగుండి సుపారీ ముఠా పోలీసులకు పట్టుబడింది. వారి వద్ద నుండి కత్తులు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. నీలం శ్రీనివాస్ మరియు కుంటయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం
Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు
Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !