అన్వేషించండి

Naveen reddy Video : వైశాలి వెర్షన్ విన్నారు.. ఇక నవీన్ రెడ్డి చెప్పేదేంటో తెలుసా ? ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ఇంకో కోణం ఇదే !

వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి వాదన బయటకు వచ్చింది. ఆయనేం చెప్పాడంటే ?

Naveen reddy Video :   ఆదిభట్లలో వైశాలి అనే యువతి ఇంటిపై దాడి చేసి తల్లిదండ్రుల్ని కొట్టి కిడ్నాప్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు కేసులు పెట్టారు. సాయంత్రానికి వైశాలి ఇంటికి చేరింది. తర్వాత పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుడు నవీన్ రెడ్డి పై వైశాలి చాలా ఆరోపణలు చేశారు. నవీన్ రెడ్డి తల్లి కూడా మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు దాడి చేయడం తప్పేనన్నారు కానీ అంతకు ముందు ఏం జరిగిందో చూడాలన్నారు. అయితే అసలు నవీన్ రెడ్డి వెర్షన్ ఏమిటో బయటకు రాలేదు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఓ సెల్ఫీ వీడియో మాత్రం వెలుగులోకి వచ్చింది. అదిప్పుడు నవీన్ రెడ్డి వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. 

సెల్ఫీ వీడియోలో నవీన్ రెడ్డి ఓపెన్ అయ్యాడు. తాను చేసింది తప్పేనని ... కానీ దాని వెనుక చాలా పెయిన్ దాగుందన్నాడు.  తనకున్న కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగానే తాను పోలీసులకు సరెండర్ కాలేదని పేర్కొన్నాడు.ఈ కిడ్నాప్ విషయంలో తనను మాత్రమే నెగెటివ్‌గా చూస్తున్న వాళ్లంతా.. ఒకవేళ తనకు జరిగినట్టే ఒక అమ్మాయికి జరిగి ఉంటే.. ఇలానే స్పందించే వాళ్లా అని ప్రశ్నించాడు.  ఈ విషయాన్ని ఒక అమ్మాయికి జరిగిందనో.. ఒక అబ్బాయికి జరిగిందనో చూడకుండా.. ఒక ఫ్యామిలీకి, ఒక మనసుకు సంబంధించిన విషయంగా చూడాలని రిక్వెస్ట్ చేశాడు.

అసలు వైశాలితో ఎలా పరిచయం అయిందో అన్న దగ్గర్నుంచి నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియోలో వివరించారు.  బ్యాడ్మింటన్‌లో తాను ఆడే కోర్టుకే వైశాలి, ఆమె ఇరుగుపొరుగు వచ్చి ఆడేవారని నవీన్ రెడ్డి చెప్పాడు. తర్వాత వైశాలి ఒక్కరే బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చేదని, అక్కడ ఆమె పరిచయం అయ్యిందని తెలిపాడు. ఆట ముగించిన తర్వాత మిస్టర్ టీ వ్యవహారాల్లో తాను బిజీగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. బ్యాడ్మింటన్ కోర్ట్‌కు సమీపంలోనే తన టీ స్టాల్ వుండటంతో వైశాలితో కబుర్లు చెబుతూ వుండేవాడినని, కొన్నిరోజులకు ఇద్దరి అభిరుచులు కలిశాయని తెలిపాడు. ఈ క్రమంలోనే పెళ్లి విషయాన్ని కొన్ని ప్రస్తావించాని వివరించాడు. ఆ తర్వాత తనకు చాలా అన్యాయం జరిగిందన్నాడు.కానీ అదేమిటో చెప్పలేదు. సెల్ఫీ వీడియో పూరి స్థాయిలో బయటకు రాలేదని తెలుస్తోంది. 

ఇక తన మీద మీడియాలో చాలా ప్రచారాలు జరుగుతున్నాయని నవీన్ రెడ్డి వాపోయాడు. దాని వల్ల తన కుటుంబం కూడా బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన మోసం ఏంటన్న వీడియో మాత్రం ఈ సెల్ఫీ వీడియోలో లేదు.  ఈ వీడియో.. తాను పోలీసులకు దొరకముందే రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కానీ.. నవీన్ పోలీసులకు దొరికిన తర్వాతే ఈ వీడియోలు బయటికి వచ్చాయి. రెండు పార్టులు వీడియోలు బయటకు వచ్చాయి. మధ్యలో ఇంకొంత భాగాన్ని లీక్ చేయలేదని తెలుస్తోంది. 5 రోజులుగా తప్పుంచుకు తిరుగుతున్న అతన్ని గోవాలో అరెస్ట్‌‌ చేశారు. కాండోలిమ్‌‌ బీచ్‌‌లో పట్టుబడిన అతన్ని హైదరాబాద్‌‌కు తరలించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Attapur Kidnap: అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
Hyderabad Airport Drug Bust: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !
Hyderabad Kidnap: అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కలకలం - నిజమేనా? ప్రాంక్ వీడియోనా?
అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కలకలం నిజమేనా? ప్రాంక్ వీడియోనా?
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Caste Census 2027: కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
FD Rates 2026: బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ FDల కండీషన్లు మరిచిపోవద్దు
Modi In Italy: మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
Ebola Virus : ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
He Man Telugu Trailer : హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
Embed widget