News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Medak Crime News: భర్తను చంపి పక్కింటివారిపైకి నెట్టేసిన భార్య! రైతు బీమా డబ్బులతో సుపారీ

Medak Crime News: గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధం నడుపుతోంది. విషయం తెలిసి ప్రశ్నించిన భర్త అడ్డు తొలగించుకోవాలని స్నేహితురాలి సాయంతో అతడిని చంపేసింది. పక్కింటి వారే చంపారంటూ డ్రామా మొదలెట్టింది.

FOLLOW US: 
Share:

Medak Crime News: మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యక్తి అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు. మూడే మూడు రోజుల్లో మిస్టరీని తేల్చేశారు. పలువురితో వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భార్యే.. స్నేహితురాలి సాయంతో భర్తని చంపేసినట్లు గుర్తించారు. కౌడిపల్లి పోలీస్ స్టేషన్ లో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి మంగళవారం రోజు వివరాలు వెల్లడించారు. కౌడిపల్లి మండలం పీర్లతండా పంచాయతీ కొయ్యగుండ తండాకు చెందిన కాట్రోత్ శ్రీను (28) భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను ఈనెల 18వ తేదీన రాత్రి పొలానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి వెళ్లి ఉదయం శవమై కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే విస్తుపోయే విషయాలను వెలుగులోకి తెచ్చారు. 

వివాహేతర సంబంధాలు వద్దంటూ భర్త వార్నింగ్..

శ్రీను భార్య దేవి గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే విషయం తెలుసుకున్న భర్త ఆమెను చాలా సార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినకపోగా.. మరింత ఎక్కువ చేయడం ప్రారంభించింది. దీంతో ఇటీవేల భర్త ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో ఎలాగైనా సరే భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. తండాకు చెందిన ఆమె స్నేహితురాలు రాణి అలియాస్ నవీనతో కలిసి పథకం వేసింది. ఇందుకోసం కుమారుడి వరసయ్యే పవన్ కుమార్ సాయం తీసుకుంది. భర్తను చంపేందుకు సహకరిస్తే... రైతుబీమా డబ్బులు రాగానే 50 వేల రూపాయలు ఇస్తానని ఆశ పెట్టింది. ఇందుకు అతను కూడా ఒప్పుకోవడంతో.. ముగ్గురూ కలిసి పథకం పన్నారు. 

వేప చెట్టుకు ఉరి వేసి ముగ్గురూ కలిసి హత్య..

ఈ క్రమంలోనే ఈనెల 18వ తేదీ ఉదయం దేవి, శ్రీను తమ ఇంటి వద్ద జామ చెట్టు విషయంలో పక్కింటి కాట్రోత్ ధన్ సింగ్, అతడి కుమారులు సంతోష్, తులసీరాంతో గొడవ పడ్డారు. ఇదే అదునుగా భావించిన దేవి అదే రోజు రాత్రి పవన్ కుమార్ కు మద్యం ఇప్పించి శ్రీనుకు తాగించాలని చెప్పింది. దీంతో పవన్ కుమార్, శ్రీనును వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించాడు. అదే రోజు రాత్రి దేవి అక్కడకు చేరుకొని మత్తులో ఉన్న శ్రీనును వేప చెట్టుకు ఉరి వేశారు. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి పొలంలో పడేశారు. భర్త చనిపోయాడని .. పక్కింటి వారే చంపారంటూ డ్రామా మొదలు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దేవి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి కాల్ డేటా చెక్ చేశారు. దీని ఆధారంగానే విచారణ చేపట్టారు.

పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్న నిందితులు..

ఈ క్రమంలోనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కావాలని భార్యే భర్తను చంపినట్లు పోలీసులు గుర్తించారు. దేవిని గట్టిగా విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తానే ఈ హత్య చేసినట్లు తెలిపింది. అంతే కాకుండా తన స్నేహితులరాలు రాణి, 50 వేలు ఇస్తానని చెప్పి పవన్ కుమార్ సాయం కూడా తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే చాకచక్యంగా వ్యవహరించి మూడే మూడు రోజుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు.. శాంతి, శోభారాణి, భాగయ్య, శ్రీనివాసులు, పోచయ్యను డీఎస్పీ అభినందంచి నగదు రివార్డును అందజేశారు. 

Published at : 23 Nov 2022 09:43 AM (IST) Tags: Wife Killed Husband Medak Crime News extra marital affair wife murdered husband Medak news

ఇవి కూడా చూడండి

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్

Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్

SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

టాప్ స్టోరీస్

Revanth Team: రేవంత్‌తోపాటు ప్రమాణం చేసేది ఎవరు? ఇంకా వీడని సస్పెన్స్‌

Revanth Team: రేవంత్‌తోపాటు ప్రమాణం చేసేది ఎవరు? ఇంకా వీడని సస్పెన్స్‌

Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే

Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు