By: ABP Desam | Updated at : 25 Aug 2021 09:44 AM (IST)
మహిళ అత్యాశ! పోలీసులు మంచి చెప్పినా వినలేదు (ప్రతీకాత్మక చిత్రం)
సైబర్ క్రైం నేరాల గురించి పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొంత మంది వాటి వలలో పడుతూనే ఉన్నారు. మరికొంత మంది చేజేతులా అత్యాశకు పోయి మోసపోతున్నారు. కానీ, హైదరాబాద్‌లో ఓ మహిళ మాత్రం ఒకసారి సైబర్ క్రైం నేరగాళ్ల చేతులో చిక్కుకుపోయి పోలీసులను ఆశ్రయించింది. వారు హిత బోధ చేసినా వినకుండా మళ్లీ సైబర్ నేరగాళ్లనే నమ్మింది. చివరికి రెండోసారి కూడా చేతులు కాల్చుకుని భారీ మొత్తంలో సొమ్మును పోగొట్టుకుంది. హైదరాబాద్‌లోని మణికొండలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సైబర్ క్రైం ఘటన వెలుగు చూసింది. మణికొండలో నివసించే బాధితురాలు(36) ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కొంత కాలం కిందట బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధికంగా లాభాలు పొందవచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చూసింది. దానికి ఆమె ఆకర్షితురాలై ఓ యాప్‌లో రిజిస్టర్ అయ్యింది. తొలుత రూ.5 వేలు అందులో పెట్టుబడి పెట్టింది. అతి తక్కువ సమయంలోనే ఆమె రూ.2,500 లాభం పొందారు. ఆ తర్వాత మరో రూ.5 వేలు పెట్టగా ఇంకో రూ.2,500 లాభం వచ్చింది. తర్వాత అత్యాశతో ఇంకో రూ.50 వేల పెట్టుబడి పెట్టగా.. రూ.25 వేల వరకూ లాభం వచ్చింది. ఈ లాభాలన్నింటినీ ఆమె సులువుగానే విత్‌డ్రా చేసుకోగలిగారు.
దీంతో ఆ యాప్‌పై బాధితురాలికి బాగా నమ్మకం కలిగింది. వెంటనే ఓ రోజు ఏకంగా రూ.10 లక్షల భారీ మొత్తం పెట్టుబడి పెట్టారు. కొద్ది సమయానికి ఆ 10 లక్షలకు గానూ ఏకంగా రూ.2.5 కోట్ల లాభం వచ్చినట్లుగా యాప్‌లో చూపించింది. అయితే, ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. తనకు విత్ డ్రా విషయంలో ఇబ్బంది కలుగుతోందంటూ మహిళ ఆ యాప్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసింది. దీంతో వారు మరో రూ.10 లక్షలు రీఛార్జ్ చేస్తే.. మొత్తం లాభం రూ.5 కోట్లు అవుతుందని నమ్మబలికారు. ఆమెకు అనుమానం వచ్చి సైబరాబాద్ కమిషనరేట్‌లో అసలు విషయం తెలుసుకునేందుకు వచ్చారు.
అక్కడి పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివి నమ్మొద్దంటూ ఆర్థిక నేరాల విభాగానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ హితబోధ చేసి పంపారు. అయినా ఆమె వాటిని తలకెక్కించుకోలేదు. ఇంటికి వెళ్లిన ఆమెకు రెండు, మూడుసార్లు సదరు కంపెనీ కస్టమర్ కేర్ ప్రతినిధులు ఫోన్ చేశారు. ఇంకో రూ.10 లక్షలు కడితే.. రూ.5 కోట్లు మీవేనంటూ నమ్మకం కలిగించారు. దీంతో ఆమె మరో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత వివిధ రకాల ఛార్జీల పేరిట మరో రూ.5.50 లక్షలు వసూలు చేశారు. చివరకు 15 శాతం పన్ను కడితేనే విత్‌డ్రా చేసుకోవచ్చంటూ తేల్చి చెప్పారు. ఆమెకు అనుమానమొచ్చి మళ్లీ సైబరాబాద్ కమిషనరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో.. ఆమె తీరు చూసి పోలీసులు విస్తుపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
ఆన్‌లైన్‌లో మెక్సికన్ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>