(Source: ECI/ABP News/ABP Majha)
BMW Accident: మందులు కొనుక్కుని వెళ్తుండగా ఢీ కొట్టిన BMW,ఆసుపత్రికి తరలించే లోపే మృతి
BMW Accident: ఢిల్లీలో ఓ BMW కార్ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
BMW Accident Delhi:
ఢిల్లీలో దారుణం..
ఢిల్లీలో BMW కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఓ వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెస్ట్ ఢిల్లీలోని మోతీబాఘ్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ కిరాణా షాప్ నడుపుకునే అజయ్ గుప్తా...షాప్ బంద్ చేసి వస్తుండగా కార్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కార్ని ఓ మహిళ నడుపుతోంది. ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ ఓ జనరేటర్‌ని ఢీకొట్టిన కార్..ఆ తరవాత నేరుగా అజయ్ గుప్తాపై దూసుకెళ్లింది. ఆమె ఓ పార్టీకి వెళ్లి వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆమెను అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తమకు యాక్సిడెంట్‌కి సంబంధించిన సమాచారం అందినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి అక్కడ రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమై ఉన్నట్టు చెప్పారు. అయితే...యాక్సిడెంట్ చేసిన ఆ అమ్మాయి అక్కడ కనిపించలేదు. బాధితుడి డెడ్‌బాడీ కూడా అక్కడ లేదు. అయితే...ఆ యువతి బాధితుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. అక్కడి నుంచి ESI హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు వచ్చే సమయానికి ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయాడు. అక్కడే స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.
"ఓ మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కార్ వచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు ఓ పార్టీకి వెళ్లి వస్తూ ఈ యాక్సిడెంట్ చేసింది. ర్యాష్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశాం. "
- పోలీసులు
Delhi | A man died after he was hit by a woman driving a BMW car in West Delhi's Moti Nagar area at around 4 am, earlier today. FIR registered, accused arrested. Further probe underway: Police pic.twitter.com/PVIKCJqC7S
— ANI (@ANI) May 21, 2023
Delhi | Arrested woman accused who killed a man, by running her car over him in Moti Nagar, was granted bail.
— ANI (@ANI) May 21, 2023
గుడ్గావ్లో ఇటీవలే స్పోర్ట్స్ కార్ పార్ష్ (Porsche Car Fire)కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరి వేగంతో వచ్చి డివైడర్ని ఢీకొట్టింది. ఆ తరవాత అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. వెంటనే కార్లో నుంచి మంటలు చెలరేగాయి. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్ అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. గుడ్‌గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్లో తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కార్లో ఇద్దరున్నారు. ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే...కార్లో మంటలు రాకముందే ఎలాగోలా అందులో నుంచి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. కాస్త ఆలస్యమైనా కార్‌తో పాటు సజీవదహనం అయ్యే వారు. చండీగఢ్‌లో రిజిస్టర్ అయిన ఈ కార్ డ్రైవర్ మితిమీరిన వేగంతో కార్ని నడిపినట్టు పోలీసులు వెల్లడించారు. కంట్రోల్ తప్పి డివైడర్ని ఢీకొట్టిందని చెప్పారు. ఓ డివైడర్ని ఢీకొట్టి పూర్తిగా పక్క రోడ్డువైపు కార్ దూసుకెళ్లింది. అక్కడే ఓ చెట్టుని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది.
Also Read: UP Road Accident: బైక్ ను ఢీకొన్న బస్సు, బైకర్ మృతి - 12 కిలోమీటర్లు బండిని లాక్కెళ్లిన డ్రైవర్