News
News
వీడియోలు ఆటలు
X

UP Road Accident: బైక్ ను ఢీకొన్న బస్సు, బైకర్ మృతి - 12 కిలోమీటర్లు బండిని లాక్కెళ్లిన డ్రైవర్ 

UP Road Accident: ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బస్సు బైక్ ను 12 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లింది.

FOLLOW US: 
Share:

UP Road Accident: ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ ను బస్సు 12 కిలో మీటర్ల వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 19వ తేదీన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎటా ప్రాంతం నుండి ఢిల్లీకి వెళ్తున్న ఫజల్ గంజ్ డిపోకు చెందిన బస్సు.. ఆవుల కొట్ట వద్దకు రాగానే వికాస్ అనే బైకర్ ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో వికాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ బైకర్ గురించి పట్టించుకోకుండా బస్సు డ్రైవర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆ బైక్ బస్సు బానెట్ లో ఇరుక్కు పోయింది. ఆ బస్సు డ్రైవర్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఆ బస్సును అలాగే ముందుకు పోనిచ్చాడు.

బైక్ ను లాక్కెళ్తుండగా తీసిన వీడియో వైరల్..

రోడ్డున వెళ్లే వారు కొంత మంది ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతంలో బస్సును వెతుక్కుంటూ వెళ్లారు పోలీసులు. రోడ్డు ప్రమాదం జరిగిన చోటు నుండి ఢిల్లీ వైపుకు 12 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లిపోయాడు ఆ డ్రైవర్. అంతలోనే పోలీసులు వచ్చి బస్సును ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సు బైక్ ను లాక్కెళ్తున్న దృశ్యాలను వాహనదారులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. రోడ్డు ప్రమాదానికి కారణమై, ఆ తర్వాత పట్టించుకోకుండా వెళ్లి పోయిన బస్సు డ్రైవర్ అజయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. బైకర్ వికాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఏడాది జనవరిలోనూ ఇలాంటి ఘటనే..!

ఢిల్లీలోని కంజావాలా హిట్ అండ్ రన్ కేస్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. నోయిడాలో ఓ కార్‌ టూవీలర్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న స్విగ్గీ ఏజెంట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన తరవాత దాదాపు 500 మీటర్ల వరకూ కార్‌..బైక్‌ని లాక్కెళ్లిందని పోలీసులు వెల్లడించారు. "స్విగ్గీ ఏజెంట్ కౌశల్...ఫుడ్ డెలివరీ కోసం బయటకు వచ్చాడు. నోయిడా సెక్టార్ 14 వద్ద ఓ కార్ వేగంగా వచ్చి ఢీకొట్టింది" అని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం...బైక్.. కార్‌కు చిక్కుకుంది. కొంత దూరం వరకూ కార్ డ్రైవర్ అలానే ముందుకు వెళ్లాడు. కార్‌లో బాధితుడు చిక్కుకున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి
కింద పడిపోయాడు. అప్పుడు కానీ డ్రైవర్ కార్‌ ఆపలేదు. అప్పటికే కౌశల్ మృతి చెందాడు. మృతుని వయసు 24 ఏళ్లు అని పోలీసులు నిర్ధరించారు.

అర్ధరాత్రి 1 గంటకు కౌశల్‌కు తన సోదరుడు కాల్ చేశాడు. అప్పటికే కౌశల్ ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి కాల్ అటెండ్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. "యాక్సిడెంట్ స్పాట్‌ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. నిందితుడిని పట్టుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు. 

Published at : 21 May 2023 07:46 PM (IST) Tags: UP News UP Road Accident Latest Accident News Bike Stuck In Bus Biker Died in Road Accident

సంబంధిత కథనాలు

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

సెంగోల్‌ ఆలోచనలో పడి సిగ్నల్‌ మర్చిపోయారు, ఒడిశా ప్రమాదంపై డీఎమ్‌కే నేత వివాదాస్పద ట్వీట్

సెంగోల్‌ ఆలోచనలో పడి సిగ్నల్‌ మర్చిపోయారు, ఒడిశా ప్రమాదంపై డీఎమ్‌కే నేత వివాదాస్పద ట్వీట్

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?