అన్వేషించండి

SI caught by ACB: 50వేలకు కుక్కుర్తి పడ్డ మాదాపూర్ కుర్ర ఎస్ఐ - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

SI Arrested: హైదరాబాద్‌ ఐటీ హబ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్, ఏసీబీ వలకు చిక్కడం కలకలం రేపింది. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Madhapur SI Vinay caught red handed by ACB:   సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అత్యంత కీలకమైన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్  వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మంగళవారం సాయంత్రం ఒక సివిల్ వివాదానికి సంబంధించిన కేసులో బాధితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు, అతడిపై నమోదైన కేసులో సహాయం చేసేందుకు ఎస్ఐ వినయ్ రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు.

పక్కా వ్యూహంతో ఏసీబీ ట్రాప్

లంచం డిమాండ్ చేసిన విషయంపై బాధితుడు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అధికారులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ బృందం, మంగళవారం మాదాపూర్ ప్రాంతంలో ఎస్ఐ వినయ్ సదరు బాధితుడి నుంచి రూ. 50 వేల నగదు తీసుకుంటుండగా మెరుపు దాడి చేసింది. ఎస్ఐ చేతులకు జరిపిన కెమికల్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో, ఆయన లంచం తీసుకున్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది. అధికారులు నగదును స్వాధీనం చేసుకుని, వినయ్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.

స్టేషన్‌లో కలకలం - లోతైన విచారణ 
 
ఎస్ఐ అరెస్టుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు స్టేషన్‌లో వినయ్‌కు సంబంధించిన రికార్డులను, ఆయన పర్యవేక్షిస్తున్న కేసు డైరీలను కూడా తనిఖీ చేశారు. ఈ లంచం వ్యవహారంలో స్టేషన్‌కు చెందిన ఇతర సిబ్బంది లేదా ఉన్నతాధికారుల ప్రమేయం ఏదైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఐటీ కారిడార్‌గా పేరున్న మాదాపూర్ పరిధిలో శాంతిభద్రతల రక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారే ఇలా అవినీతికి పాల్పడటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అవినీతి అధికారులకు ఏసీబీ హెచ్చరికలు

నిందితుడైన ఎస్ఐ వినయ్‌ను బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీపీ అధికారులు ప్రజలకు సూచించారు. అక్రమాలకు పాల్పడే అధికారులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని, విధుల్లో నిజాయితీ లేని వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.   

టాప్ హెడ్ లైన్స్

Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Case Filed On Veeramachaneni: వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి పేరుతో నమ్మించి ఓయోలో యువతి హత్య
హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి పేరుతో నమ్మించి ఓయోలో యువతి హత్య
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
34 Percent BC Reservation Supreme Court: బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Embed widget