అన్వేషించండి

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత.. విధి నిర్వహణలో అమరురాలైన వీరనారి

గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య మృతిచెందారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె కన్నుమూశారు.

హైదరాబాద్‌: నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య శనివారం రాత్రి 9:41 గంటలకు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం గత వారం రోజులుగా శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. సౌమ్య మరణం పట్ల నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం, సౌమ్యకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా అత్యాధునిక లైఫ్ సపోర్ట్, వైద్య సేవలు అందించారు. కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతినడంతో డయాలసిస్,  ఇతర అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత.. విధి నిర్వహణలో అమరురాలైన వీరనారి

అసలేం జరిగింది.. 
జనవరి 23న నిజామాబాద్ జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, గంజాయి ముఠా కారుతో సౌమ్యను ఢీకొట్టి ఆమె పైనుంచి దూసుకెళ్లారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక కిడ్నీని సర్జరీ ద్వారా తొలగించాల్సి వచ్చింది. 

సౌమ్య వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని గతంలోనే మంత్రులు ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 25 ఏళ్ల సౌమ్య 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గత 20 నెలలుగా నిజామాబాద్‌లో సేవలు అందిస్తున్నారు. కానీ డ్యూటీ చేస్తుండగా ఓ గంజాయి బ్యాచ్ చేసిన అరాచకానికి సౌమ్య ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Embed widget