Madanapalle Crime : ఈజీ మనీ కోసం యువకుడి స్కెచ్, ప్లాన్ రివర్స్ అయి పోలీసులకు చిక్కాడు

Madanapalle Crime : బీటెక్ చేసిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాకు. కార్లను రెంట్ కు తీసుకుని వాటిని వేరే వారి వద్ద తనఖా ఆ నగదుతో జల్సాలు చేశావాడు.

FOLLOW US: 

Madanapalle Crime : ప్రస్తుత సమాజంలో కొందరు యువకులు ఈజీ మనీకి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ వారి జీవితాలను నాశనం చేసుకునేలా చేస్తుంది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఓ యువకుడు వేసిన ఆలోచన పోలీసులనే షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ యువకుడు వేసిన ప్లాన్ ఏమింటంటే? 

జల్సాలకు అలవాటు పడి 

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం వేపులపల్లి గ్రామంలో మహేశ్వర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. బీటెక్ వరకూ చదివిన మహేశ్వర్ రెడ్డి కొంత కాలం ఉద్యోగం చేశాడు. అయితే జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసగా మారిన మహేశ్వర్ రెడ్డికి ఆ నగదు సరిపడేది కాదు. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఈజీ మనీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేసేవాడు. మదనపల్లెకు చెందిన మౌలా దగ్గర మహేంద్ర లోగో కారు, పీటీఎం మండలానికి చెందిన అనిల్ రెడ్డి వద్ద ఎక్స్‌యూవి 500 కారు రోజు బాడుగకు తీసుకున్నాడు. కొద్ది రోజుల పాటు వారికి నమ్మకంగా ఉంటూ నమ్మించాడు. అలాగే కారును బాడుగకు తీసుకొనే ముందు తన ఆధార్ కార్డు, ఇతర వివరాలను తెలిపేవాడు. కారు‌ను బాడుగకు తీసుకున్న తరువాత మూడు నెలలుగా బాడుగ డబ్బులు ఇవ్వకుండా, ఫోన్ స్విఛ్చ్ ఆఫ్ చేసి తప్పించుకుని తిరిగే వాడు. అంతే కాకుండా కారును కూడా తిరిగి ఇచ్చేవాడు కాదు. 

తప్పించుకుని తిరుగుతూ 

డబ్బు అవసరం అయ్యే సరికి బాడుగకు తీసుకున్న కార్లను ఏకంగా అమ్మడానికి ప్రయత్నం చేశాడు మహేశ్వర్ రెడ్డి. అయితే కార్లను బాడుగకు ఇచ్చిన కారు యజమానులు ఎన్ని సార్లు మహేశ్వర్ రెడ్డి ఇంటికి తిరిగినా తాళాలు వేసి ఉండడం, అతని గురించి ఎవరికి సరైనా వివరాలు తెలియకపోవడంతో అనుమానం వచ్చిన కారు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు మహేశ్వర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా మహేశ్వర్ రెడ్డి తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. మహేశ్వర్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఇరవై ఐదు లక్షల విలువ చేసే కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచ్చారి అన్నారు..

Published at : 26 Apr 2022 10:16 PM (IST) Tags: AP News Tirupati News Crime News Madanapalle rental cars selling

సంబంధిత కథనాలు

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !

Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !

Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్

Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!