IND in IRE, 2 T20Is, 2022 | 1st T20I | Malahide Cricket Club Ground, Dublin - 26 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND
IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Fake Social Media Update: ఫేక్‌ ప్రొఫైల్‌తో బ్లాక్‌ మెయిల్.. నమ్మితే డబ్బులు ఢమాల్..

Fake Social Media Update: ఫేక్ ప్రొఫైల్‌తో ఓ వ్యక్తి అమ్మాయిని మోసం చేయడంతో పాటు వేధింపులకు గురిచేసిన ఘటన గుంటూరులో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు కటకటాల పాలయ్యాడు.

FOLLOW US: 

దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీకి తగ్గట్లు కొత్త మార్గాలను ఎంచుకుని మరీ కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైళ్లు క్రియేట్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫేక్ ఐడీతో అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిని గుంటూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

గుంటూరులోని సంజీవ్ నగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కొడుకు పూనూరి రామ్ ప్రకాశ్ బీఏ ఎల్ఎల్‌బీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ప్రియ (PRIYA1239301) అనే అమ్మాయి పేరుతో రామ్ ప్రకాశ్ ఇన్స్‌స్టాగ్రాంలో ఏడాది క్రితం ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దాని నుంచి ఇంటర్మీడియట్ చదివే ఓ అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్టు పెట్టాడు. ఆమెతో పరిచయం అయిన తర్వాత తన అసలు ప్రొఫైల్ ద్వారా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. 

తాను కష్టాల్లో ఉన్నానని, డబ్బులు కావాలని రామ్ ప్రకాశ్ అమ్మాయిని అడిగాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు విడతల వారీగా మొత్తం రూ.85,000 వరకు చెల్లించింది. కొంత కాలం తర్వాత అనుమానం వచ్చిన యువతి అతనితో చాటింగ్ చేయడం ఆపేసింది. దీంతో రామ్ ప్రకాశ్ ఆమెకు ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

రామ్ ప్రకాశ్ వేధింపులు భరించలేక బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రామ్ ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రామ్ ప్రకాశ్ గతంలోనూ పలువురు అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. 

వైద్యం పేరుతో టోకరా.. 
మెహదీపట్నానికి చెందిన ఓ ఆయుర్వేద డాక్టర్ కూడా ఓ వ్యక్తి మాటలు నమ్మి మోసపోయారు. ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు ఓ నైజీరియన్ వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి చేస్తానని.. మూలికల ఫార్ములా చెబితే రూ.5 కోట్లు ఇస్తానని సదరు వ్యక్తి నమ్మబలికాడు. ఈ మొత్తానికి అయ్యే ట్యాక్స్ తనకు చెల్లిస్తే అసలు డబ్బును వేస్తానని చెప్పడంతో ఆమె సరేనంది. వెంటనే రూ.41 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. తర్వాత అతని నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన వైద్యురాలు పోలీసులను ఆశ్రయించింది. ముంబై, బెంగుళూర్ నగరాల్లో ఉంటూ మోసాలు చేస్తున్న నైజీరియన్ నేరగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 
నేరగాళ్లతో తస్మాత్.. 

  • సైబర్ నేరస్తుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని తెలిపారు. ఇలాంటి విషయాల్లో కామన్ సెన్స్‌ ఉపయోగించాలని పేర్కొన్నారు. 
  • సోషల్ మీడియా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ద్వారా డూప్లికేట్ చేసే అవకాశం ఉండదని తెలిపారు. ఎవరిదైనా డూప్లికేట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 
  • సోషల్ మీడియా వేదికల ద్వారా (ఫేస్ బుక్, ఇన్స్‌స్టాగ్రాం మొదలైనవి) ఎవరైనా డబ్బులు అడిగితే పంపవద్దని తెలిపారు.
  • అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ, బ్యాంకు వివరాలు వంటివి పంచుకోవద్దని హెచ్చరించారు.
  • సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని గ్రహిస్తే వెంటనే పోలీసులు లేదా సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. 
Published at : 16 Jul 2021 04:08 PM (IST) Tags: LLB student Fake Social media update cyber crime guntur

సంబంధిత కథనాలు

East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ఇద్దరు మృతి

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ఇద్దరు మృతి

Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!

Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!

Praja Vedika Demolition : చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత, ప్రజా వేదిక కూల్చివేతపై టీడీపీ శ్రేణుల నిరసన

Praja Vedika Demolition : చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత, ప్రజా వేదిక కూల్చివేతపై టీడీపీ శ్రేణుల నిరసన

టాప్ స్టోరీస్

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?