అన్వేషించండి

Gudivada: నిజనిర్థారణ పేరుతో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు... రాజకీయ లబ్దికోసం ముందస్తు అరెస్టు చేయాలని కోరారు... డీఐజీ మోహన్ రావు

టీడీపీ నిజనిర్థారణ కమిటీ పేరుతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిందని డీఐజీ మోహన్ రావు అన్నారు. టీడీపీ నేతలే రాజకీయ లబ్దికోసం ముందస్తు అరెస్టు చేయాలని పోలీసులను కోరారని పేర్కొన్నారు.

నిజ నిర్ధారణ కమిటీ పేరుతో టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు అన్నారు. ఆరుగురు సభ్యులు గల టీడీపీ కమిటీకి ప్రజాస్వామ్యబద్ధంగా ముందస్తుగా పోలీసులు అనుమతి ఇచ్చారని తెలిపారు. టీడీపీ నేతలు భారీ ర్యాలీగా తరలివచ్చి అరుపులు, కేకలు, నినాదాలతో రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని డీఐటీ అన్నారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా టీడీపీ నేతలను అరెస్టు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ, టీడీపీ నేతలు ఇరువురిని ముందస్తు చర్యగా అరెస్టు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. టీడీపీ నాయకులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ముందస్తుగా అరెస్టు చేయాలని పోలీసులను కోరినట్లు డీఐజీ వెల్లడించారు. 

Also Read: గుడివాడలో కేసినో మంటలు... టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల దాడి ... టీడీపీ నేతల అరెస్ట్ !

అసలేం జరిగిందంటే...!

కృష్ణా జిల్లా గడివాడ శుక్రవారం రణరంగం అయింది. సంక్రాంతి సందర్భంగా కేసినో ఏర్పాటు చేసి జూదం నిర్వహించారన్న ఆరోపణలపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నియమించింది. ఆ కమిటీ శుక్రవారం గుడివాడలో పర్యటించాల్సి ఉంది. అయితే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు ముందుగానే వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు గుడివాడ కే- కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు ర్యాలీగా టీడీపీ ఆఫీసు వద్దకు వెళ్లారు. అక్కడ టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. మరో వైపు నిజనిర్ధారణ కమిటీని పోలీసులు గుడివాడలోకి కూడా రానీయలేదు.  టీడీపీ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్య ఉన్నారు. పామర్రు వద్దనే అడ్డుకున్న పోలీసులు ఒక్క కారును మాత్రమే అనుమతిస్తామన్నారు. అక్కడ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వీరందర్నీ గుడివాడలోకి రాక ముందే అరెస్ట్ చేసి తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ నేత బొండా ఉమ కారుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు . దీంతో కారు ధ్వంసం అయింది.  

Also Read: గుడివాడలో టీడీపీ వర్సెస్ వైఎస్‌ఆర్‌సీపీ - కేసినో రాజకీయంతో ఉద్రిక్తత.. మోహరించిన పోలీసులు !

ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తారని తెలిసినా పోలీసులు వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్ని నియంత్రించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల పాటు కేసినోలు నిర్వహించినా పోలీసులు ఆ వైపు చూడలేదని.. ఇప్పుడు టీడీపీ నేతలు నిజ నిర్ధారణ చేసేందుకు వస్తున్నారని తెలిసి కూడా వైఎస్ఆర్‌సీపీ నేతల్ని నియంత్రించలేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు గుడివాడలోకి రాకుండా ప్రధాన రహదారిపై బారికేడ్లు ..రోప్‌ పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు కానీ దాడులకు దిగుతున్న అధికార పార్టీ నేతలను మాత్రం అడ్డుకోలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
Adilabad Bangladesh Illegal Burglar Gang Arrest: దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget