అన్వేషించండి

Bantumilli News : బంటుమిల్లిలో విషాదం, నూతిలో పూడికతీతకు దిగి నలుగురు మృతి!

Bantumilli News : కృష్ణా జిల్లా బంటుమిల్లిలో విషాదం చోటుచేసుకుంది. బావిలో పూడిక తీసేందుకు దిగిన నలుగురు మృతి చెందారు.

Bantumilli News : కృష్ణాజిల్లా బంటుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నూతిలోని మట్టి తీసేందుకు దిగిన నలుగురు వ్యక్తులు ఊపిరాడక చనిపోయారు. వీరిలో ఇద్దరు బంటుమిల్లి బీఎన్ఆర్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు, మరొకరు ములపర్రు గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మరొకరు ఇంటి యజమానిగా తెలుస్తోంది. వీరంతా నూతిలో మట్టి పూడిక తీసేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు.  మృతులు రంగా, శ్రీనివాసరావు, రామారావు , లక్ష్మణరావుగా గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

లఖ్ నవూలో ఘోర ప్రమాదం 

 ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా లఖ్‌నవూలోని దిల్‌కుషా ప్రాంతంలో ఆర్మీ ఎన్‌క్లేవ్ సరిహద్దు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది వరకు మృతి చెందారు. శిథిలాల నుంచి ఓ వ్యక్తిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు.  

" కొంతమంది కార్మికులు దిల్‌కుషా ప్రాంతంలోని ఆర్మీ ఎన్‌క్లేవ్ వెలుపల గుడిసెలలో నివసిస్తున్నారు. రాత్రిపూట భారీ వర్షాల కారణంగా ఆ ప్రహారీ గోడ కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే మేం తెల్లవారుజామున 3 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నాం. శిథిలాల నుంచి 9 మృతదేహాలను వెలికి తీశాం. ఓ వ్యక్తిని సురక్షితంగా కాపాడగలిగాం. " -పీయూష్ మోర్డియా, జాయింట్ పోలీస్ కమిషనర్, లా అండ్ ఆర్డర్

గోడ కూలిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఇక ఉన్నావ్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు.

" లఖ్‌నవూలో శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ ఎన్‌క్లేవ్ ప్రహారీ గోడ కూలిపోయిన ఘటనలో మృతి చెందిన వారు సాధారణ కార్మికులు. ఆ సమయంలో వారు నిద్రిస్తున్నారు. గోడ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నాం.  " -బ్రజేష్ పాఠక్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget