అన్వేషించండి

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం జాన్నాడ శివారు పంట కాలువలో లభ్యమైన హిజ్రా మృతి కేసు మిస్టరీ చేదించారు పోలీసులు... హిజ్రను హత్య చేసిన ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారు..

అయిదేళ్లుగా సాన్నిహిత్యంగా ఉంటున్న వారిలో ఒక్క సారిగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొన్ని రోజులుగా ఎడ మొహం పెడ మోహంగా ఉన్నారు. తన గురించి తప్పుగా మాట్లాడడం, గేలి చేయడం మానసికంగా చులకనగా చూడడం తట్టుకోలేక పోయాడు. కక్ష పెంచుకున్నాడు. చివరకు హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. మద్యం సేవిస్తూ మాట్లాడుకుందాం అని పిలిపించాడు. స్నేహితులతో కసితీరా పొడిచి చంపేశాడు. డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం జాన్నాడ శివారు పంట కాలువలో లభ్యమైన హిజ్రా మృతి కేసు మిస్టరీ ఛేదించారు పోలీసులు. హిజ్రాను హత్య చేసిన ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారు.
 
బుధవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు  చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఖాదర్ భాషా వివరాలను వెల్లడించారు. 
జొన్నాడ పంట కాలువలో హిజ్రా మృతదేహం...
మే నెల 13 తేదీ రాత్రి  ఆలమూరు మండలం జొన్నాడ గ్రామ శివారు, ఎన్ హెచ్ 216ఏ రహదారిని ఆనుకొని పంటకాలువలో ధవళేశ్వరం గ్రామానికి చెందిన మరపట్ల ఆనంద్ అలియాస్ ఆనంది అనే హిజ్రాని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో చంపినట్లు సమాచారం వచ్చిందని ఏఎస్పీ ఖాదర్ భాషా తెలిపారు. శరీరంపైన తీవ్ర గాయాలున్నాయి. మెడ కోసి చంపి అక్కడ వదిలేసి వెళ్లినట్లు చుట్టుప్రక్కల వారి ద్వారా విషయం తెలుసుకొన్న ఆనంది గురువు అయిన ధనాల మందాకిని, ఆలమూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఆలమూరు ఎస్సై శివ ప్రసాద్  కేసు నమోదుచేశారు. డా. బి ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్ ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణ లో, రావులపాలెం సీఐ ఎన్. రజని కుమార్ దర్యాప్తు చేపట్టారని భాషా వివరించారు. దర్యాప్తులో భాగంగా టెక్నాలజీ ఉపయోగించి, ఆనందితో పరిచయం ఉన్న కేతా భరత్ వెంకట సుధీర్ @ పెద్ద కెతాను, అతని స్నేహితులు అయిన వీలు కళ్యాణ్ @ పెద్ద కల్లి, సింగంపల్లి కార్తికేయ @ సింభ @ సోనూ అను ముగ్గురిని విచారించి హత్య ఉదంతం వెలుగు చూసినట్లు తెలిపారు.  
ప్లాన్ ప్రకారం పిలిచి హత్య... 
మే నెల 12 వ తేదీ రాత్రి  కేతా భరత్ వెంకట సుధీర్, స్నేహితులు సింగంపల్లి,  సోనూ కలిసి ఆనంది(హిజ్రా) ని వాళ్ళ మోటార్ సైకిల్ పై వేమగిరి సెంటర్ లో ఎక్కించుకొని, తర్వాత మద్యం కొనుక్కొని జొన్నాడ శివారు పంటకాలువ వద్దకు తీసుకువెళ్లారు. బాగా మద్యం సేవిస్తుండగా ఇంతలో పెద్ద కేత మరొక స్నేహితుడు అయిన వీలు కళ్యాణ్ (కళ్లి )ఫోన్ చేయగా తనని కూడా అక్కడకు రప్పించారు. పెద్ద కల్లీ కూడా మద్యం తాగిన తర్వాత మృతురాలు ఆనంది(హిజ్రా), పెద్ద కేతా గురించి తప్పుడు గా ప్రచారం చేస్తుందనే కోపంతో ముందుగా కేతా భరత్  తన వద్ద ఉన్న బటన్ నైఫ్ తో ఆనంది మీద దాడి చేశాడు. సోనూ కాళ్ళు గట్టిగా పట్టుకోగా, పెద్దకేతా వద్ద ఉన్న బటన్ నైఫ్ ని కల్లీ లాక్కొని మెడ వెనుక వైపు పొడిచాడు. సోనూ బీర్ బాటిల్ తో తల మీద కొట్టడంతో ఆనంది చనిపోయిందని ఏఎస్పీ తెలిపారు. ముగ్గురూ ఆనందిని పక్కనే ఉన్న పంట బొదే లోనికి నెట్టివేశారు. అప్పటికి ఆనంది (హిజ్ర) కొన ఊపిరితో ఉండటంతో అది గమనించిన కల్లీ ఇది (ఆనంది)  బతికుంటే తమ పేరు చెబుతుందని దిగి ఆమెపై విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో చనిపోయిందని నిర్దారించుకుని అక్కడ నుండి పరారయ్యారు. 
 
తప్పుగా ప్రచారం చేస్తుందనే హత్య... 
నిందితులు, మృతురాలు (హిజ్రా) అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ప్రధాన నిందితుడు కేతా భరత్ వెంకట సుధీర్ అలియాస్ పెద్దకెతా తో ఆనంది( హిజ్రా) తో వచ్చిన విభేదాలు హత్యకు దారితీశాయి. ఆనంది పెద్ద కేతా గురించి పలు చోట్ల గేలి చేస్తూ మాట్లాడడం, చులకనగా మాట్లాడడంతో రగిలి పోయిన ప్రధాన నిందితుడు తన స్నేహితుల సహాయంతో అంత మొదించి నట్లు విచారణ లో వెల్లడైందని ఏ ఎస్పీ వెల్లడించారు. నిందితులు ముగ్గురూ ఇచ్చిన వాంగ్మూలం తో వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి హత్య చేయడానికి ఉపయోగించిన బటన్ నైఫ్, ఎనిమిది వందల రూపాయల నగదు, సుజుకీ బైక్, ఒక సీడీ డీలక్స్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో కేతా పై గతంలో హత్య కేసు ఉందని పోలీసులు తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget