Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
Khammam News : ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత దారుణం హత్యకు గురయ్యారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.
Khammam News : ఖమ్మం జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్‌పై వెళ్తోన్న ఆయనను దుండగులు ఆటోతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది. తమ్మినేని కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కోటేశ్వరరావు ఇంటిపై దాడి
తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కోటేశ్వరరావు ఇంటిపై వారు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కృష్ణయ్య వరుసకు సోదరుడు అవుతాడు. కృష్ణయ్య సీపీఎంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. తెల్దారుపల్లిలో రాజకీయ విద్వేషాలే ఈ దారుణ హత్యకు కారణంగా తెలుస్తోంది. వీరభద్రం సొంత సోదరుడితో కృష్ణయ్యకు విభేదాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ఈ హత్య అనంతరం కృష్ణయ్య వర్గీయులు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తెల్దారుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. గ్రామంలో పోలీసులను మోహరించారు.
రాజకీయకక్షలే కారణమా?
దారుణ హత్యకు గురైన కృష్ణయ్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడు. కృష్ణయ్య ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడైన కృష్ణయ్య భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీటీసిగా గెలిచారు. వీరు టీఆర్ఎస్ సానుభూతి పరులుగా ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే దారుణ హత్య జరగడం ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
జూనియర్ అడ్వొకేట్ దారుణ హత్య
తెలంగాణలో అడ్వొకేట్ల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మంథనిలో వామనరావు దంపతులు, ములుగులో మల్లారెడ్డి అనే లాయర్లను దారుణ హత్యలకు గురయ్యారు. ఈ రెండు ఘటనలు మరిచిపోకముందే అలాంటి దారుణ ఘటనే మరొకటి జరిగింది. నల్గొండ జిల్లాలో జూనియర్ అడ్వొకేట్ గా పనిచేస్తున్న విజయ్ రెడ్డి (48) ని కొందరు దుండగులు కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ హత్య జిల్లాలో సంచలనంగా మారింది. దీని వెనుక స్థానిక నేతల హస్తం ఉందని మృతుడి భార్య ఆరోపణలు చేశారు.
Also Read : Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు
Also Read : Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం