News
News
వీడియోలు ఆటలు
X

Khammam Crime News: ఖమ్మంలో దారుణం - పుట్టింటికి వెళ్లిన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Khammam Crime News: భర్త, అత్తమామలతో గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన ఓ భార్యపై భర్త దారుణానికి తెగబడ్డాడు. పెట్రోల్ పోసి మరీ నిప్పంటించాడు. 

FOLLOW US: 
Share:

Khammam Crime News: పెళ్లయిన కొద్ది రోజుల నుంచి ఆ దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. భర్తతో పాటు అత్తామామలు కూడా వేధించారు. అత్తింట్లో వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వచ్చింది. సర్దిచెప్పి మళ్లీ అత్తారింటికి పంపారు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే భార్యపై విపరీతమైన కోపం పెంచుకున్న భర్త.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం జరిగింది. 

అసలేం జరిగిందంటే..?

ఖమ్మం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కు చెందిన 24 ఏళ్ల లకావత్ స్నేహకు మహబూబాబాద్ జిల్లా గార్లల మండలం పోచారానికి చెందిన శ్రీధర్ తో 2021లో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. కొద్ది నెలల క్రితమే స్నేహ పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించి.. కూతురికి సర్ది చెప్పారు. మళ్లీ అత్తారింటికి పంపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా భర్త, అత్త మామల్లో ఎలాంటి మార్పూ రాలేదు. వారు తీవ్రంగా వేధిస్తుండడంతో స్నేహ మూడు నెలల క్రితం మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె ఇక్కేడ ఉంటోంది. ఈక్రమంలోనే శనివారం శ్రీధర్ విద్యానగర్ కు వచ్చాడు. అయితే ఆ సయమంలో ఇంట్లో భార్య స్నేహ, ఆమె చెల్లెలు నేహా, తమ్ముడు డేవిడ్ ఉన్నారు. 

ఇంటికి వచ్చిన భర్త అన్నం పెట్టమని అడగడంతో.. స్నేహ ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ ను శ్రీధర్ తన భార్యపై చల్లి నిప్పంటించాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన బాధితురాలి చెల్లెలు వెంటనే జరిగినదంతా తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పింది. వారు వెంటనే వచ్చి కుమార్తెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అప్పటికే స్నేహకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని, పరిస్థితి విషమంగా ఉందని స్నేహ తండ్రి సైదులు చెబుతున్నారు. ఈక్రమంలోనే చుంచుపల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వారం రోజుల క్రితం కన్నకూతురిని నరికి చంపిన తండ్రి

వారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో పదేళ్ల వయసుున్న కన్న కూతురు రజితను తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే, గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా ఉండట్లేదు. ఈ క్రమంలోనే గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురిని చంపిన తర్వాత అదే గ్రామానికి మరో వ్యక్తి.. దూపం శ్రీనివాస్ పై కూడా సదయ్య దాడికి చేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published at : 21 May 2023 03:32 PM (IST) Tags: Khammam News Latest Crime News Telangana Telangana News Women

సంబంధిత కథనాలు

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి

Nizamabad Crime: అప్పు తీర్చు, లేకపోతే కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు- నర్సు ఆత్మహత్య!

Nizamabad Crime: అప్పు తీర్చు, లేకపోతే కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు- నర్సు ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!