అన్వేషించండి

Kerala News: కేరళలో అదృశ్యమైన మహిళ, 15 ఏళ్ల తర్వాత అసలు విషయం చెప్పిన పోలీసులు

Mannar Missing Case : కాలా భర్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని కేరళ పోలీసులు ధృవీకరించారు. ఆమెను దాచి ఉంచినట్లు భావిస్తున్న ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో సోదాలు చేయగా కాలా అవశేషాలు బయటపడ్డాయి.

Kerala News : కేరళలోని మన్నార్‌లో 15 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిళ మృతదేహం కోసం వెతుకులాటలో పోలీసులు పురోగతి సాధించారు. మన్నార్‌లో 15 ఏళ్ల కిందట కాలా అనే మహిళ అదృశ్యం అయింది. మహిళ మృతదేహం కోసం చేస్తున్న అన్వేషణలో కొత్త ముందడుగు పడింది. కాలాను దాచి ఉంచినట్లు భావిస్తున్న ఇరమత్తూరులోని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో సోదాలు చేయగా ఆమె అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు.  ప్రస్తుతం కేసులో సమగ్ర విచారణ కొనసాగుతోంది. ఐదుగురు వ్యక్తులు మహిళను హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టినట్లు రెండు నెలల క్రితం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కాలా భర్త బావమరిది సహా నలుగురిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ ప్రారంభించారు. 

కాలా భర్తే కీచకుడు
కాలా భర్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని  కేరళ పోలీసులు ధృవీకరించారు. అయితే, ఆమె కొడుకు ఈ వాదనలను తిరస్కరించాడు. తన తల్లి కాలా ఇంకా అతని తల్లి కాలా ఇంకా బతికే ఉందని గట్టిగా వాదించాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న తన తండ్రి అనిల్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.  ఈ ఆరోపణలు తమ కుటుంబానికి అవమానకరమని..  15 ఏళ్ల క్రితం ఏమీ జరగలేదని కొడుకు మీడియాతో తెలిపాడు. కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయిన తన తల్లి నుంచి ఎలాంటి సమాచారం లేదని.. అలాగని హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదన్నారు.

తన తండ్రిని సంప్రదించారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కొత్తగా జరుగుతున్న సంగతుల పట్ల అందోళన చెందవద్దని సూచించినట్లు కాలా కొడుకు తెలిపారు. అప్పుల కారణంగానే తిరిగి రాలేకపోతున్నట్లు  అనిల్ తన కుమారుడికి చెప్పినట్లు తెలుస్తోంది. 2009లో చివరిసారిగా  కనిపించకుండా పోయిన కాలా కేసు దర్యాప్తు చేస్తున్నందున తిరిగి రావాలని అనిల్‌ను పోలీసులు కోరారు. తాను పాలక్కాడ్‌లో మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్నానని కాలా తనతో చెప్పిందని, ఇప్పటివరకు ఆమె సజీవంగా ఉందని నమ్ముతున్నట్లు ఆమె తరఫు బంధువులు పేర్కొన్నారు. 

ఏడు గంటల పాటు శోధన 
 కాలాను అనిల్ హత్య చేసి తన ఇంటిలోని సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడని ఓ లేఖ  కొన్ని నెలల క్రితం పోలీసులకు అందడంతో కేసు మళ్లీ రీఓపెన్ అయింది.   20 ఏళ్ల వయసులో అలప్పుజాలోని మన్నార్‌లోని అనిల్ ఇంటి నుంచి కాలా అదృశ్యమైందని, ఆమె చనిపోయిందని మంగళవారం పోలీసులు తెలిపారు. అనిల్ ఇంటి వద్ద ఉన్న రెండు సెప్టిక్ ట్యాంకులతో ఏడు గంటలపాటు జరిపిన తనిఖీల్లో  కొన్ని ఆధారాలు లభించిన తర్వాతే పోలీసులు ఆమె చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు అలప్పుజా పోలీస్ సూపరింటెండెంట్ చైత్ర థెరిసా జాన్ తెలిపారు. మంగళవారం సెప్టిక్ ట్యాంక్‌ల నుండి కీలకమైన సాక్ష్యాలను సేకరించడంలో పోలీసులకు సహకరించిన సోమన్ అనే కార్మికుడు లోపల ఏదో రసాయనం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసినట్లు ప్రముఖ మీడియా నివేదించింది.   

ఎముకలు కరిగే రసాయనం 
‘‘ కొన్నేళ్లుగా నేను సెప్టిక్ ట్యాంక్ సంబంధిత పనులు చేస్తున్నాను. కాబట్టి ట్యాంక్‌లోకి దిగగానే అందులో ఏదైనా రసాయనాలు పోస్తే వెంటనే నాకు తెలిసిపోతుంది. దీనిలో రాళ్లు, మనుషుల ఎముకలను కూడా పౌడర్ చేసే రసాయనం పోశారు " అని కార్మికుడు సోమన్ మీడియాతో చెప్పుకొచ్చారు.  స్వాధీనం చేసుకున్న వాటిలో అనుమానాస్పద మానవ ఎముకలు, లాకెట్, హెయిర్ క్లిప్, డ్రస్ లకు సంబంధించిన ఎలాస్టిక్  ఉన్నాయని సోమన్ చెప్పారు. వీటిని పోలీసులకు అప్పగించారు.  కాలా సోదరుడు, ఆటో డ్రైవర్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. ఎన్నడూ అనిల్ పై తనకు ఎప్పుడూ సందేహం రాలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులు పోలీసు కస్టడీలో ఉన్నారు. వారి అరెస్టులను త్వరలో నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

రెండో పెళ్లి చేసుకున్న అనిల్
 అనిల్ 15 ఏళ్ల క్రితం మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసినా ప్రాథమిక విచారణలో ఎలాంటి క్లూ లభించలేదు. కాలా తల్లిదండ్రులు అప్పటికే చనిపోయారు. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు, కానీ వారు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇంతలో అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. చాలా ఏళ్లుగా కాలా గురించి ఎలాంటి సమాచారం లేదు. అనిల్, కాలా దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అనిల్‌కి రెండో పెళ్లితో మరో ఇద్దరు పిల్లలు కలిగారు. నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అనిల్‌ రెండు నెలల క్రితం ఇజ్రాయెల్‌ వెళ్లాడు. ఈ కేసులో ఐదో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగించగా, ఐదో నిందితుడి ఆచూకీ లభించలేదు. మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని మన్నార్‌లో ఆమె నివసించే స్థలంలో పాతిపెట్టినట్లు సమాచారం. దీని ఆధారంగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget