Karnataka Crime News : భార్యతో వివాహేతర బంధం - వ్యక్తి గొంతు కోసి రక్తం తాగిన భర్త ! వీడియో కూడా తీయించుకుని...
ఓ మనిషి గొంతు కోసి అతని రక్తం తాగేశాడు హంతకుడు. అతనిపై ఇంత కోపం ఎందుకు పెంచుకున్నాడంటే..తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపం. ట్విస్ట్ ఏమిటంటే బాధితుడు ప్రాణాలతోబయటపడ్డాడు.
Karnataka Crime News : మనుషుల్లో హింసా ప్రవృత్తి ఎవరూ అంచనా వేయలేని విధంగా పెరుగుతోంది. మనిషిని చంపడమే ఘోరం అనుకుంటే.. చంపిన తర్వాత అతని రక్తాన్ని తాగి వీడియో తీయించుకున్నాడో హంతకుడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
కర్ణాటకలో చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతు కోసి అతని రక్తం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది. మొదట ప్రాంక్ వీడియో అనుకున్నారు కానీ.. తర్వాత అది నిజమైన వీడియోగా తేల్చారు. తర్వాత వివరాలన్నీ బయటకు వచచాయి.
చిక్ బళ్లాపూర్ లోని చింతామణి కు చెందిన విజయ్ కూరగాయలు, బట్టల వ్యాపారం చేసేవాడు. ఇందుకోసం మారేష్ అనే వ్యక్తికి చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని సరుకులు రవాణా చేసేవాడు.ఇద్దరి మధ్య వ్యాపార బంధం పెరిగుతున్న సందర్భంగాలో మారేష్ విజయ్ ఇంటికి రావడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మారేష్‌కు విజయ్ భార్యతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తసింది. తన భార్య, మారేష్ ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని విజయ్ అనుమానించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఉందని గట్టిగా నమ్మిన విజయ్.. మారేష్‌ను తన భార్యకు దూరంగా ఉండమని హెచ్చరించాడు. అయినప్పటికీ, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కొనసాగించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ జూన్ 19న సరుకులు రవాణా చేయాలంటూ మారేష్‌ను నిర్జన ప్రాంతానికి పిలిపించాడు. జాన్ అనే బంధువును కూడా తీసుకెళ్లాడు. విజయ్, మారేష్‌ల మధ్య వాగ్వాదం జరగడంతో విజయ్ తన వద్ద ఉంచుకున్న కత్తితో మహేష్‌ను గొంతు కోశాడు.
మారేష్ గొంతు కోసిన తర్వాత విజయ్ ఊహించని పని చేశాడు. మారేష్ రక్తం తాగాడు. తన మొబైల్‌లో రికార్డ్ చేయమని జాన్‌ని కోరాడు. అప్పటికి చాలా భయపడిన జాన్ మారేష్‌ని అక్కడే వదిలేసి పారిపోయాడు. మారేష్‌పై పై విజయ్ చిన్న కత్తితో దాడి చేయడంతో ప్రాణాపాయం తప్పింది. కాసేపటికి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మారేష్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కానీ బంధువైన జాన్ తో తీయించిన వీడియోను .. తానే విజయ్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశాడు. దీంతో పోలీసులు మహేశ్‌ను ఆరా తీసి అతడి ఫిర్యాదు మేరకు నిందితుడు విజయ్‌ని అరెస్టు చేశారు.