Karnataka News: బాలిక దారుణ హత్య, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తల నరికిన యువకుడు
Crime News: మైనర్‌తో నిశ్చితార్థం ఆగిపోయిందన్న కోపంతో యువకుడు ఆ బాలిక తల నరికి దారుణంగా హత్య చేశాడు.

Man Beheads Minor: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి 16 ఏళ్ల బాలిక తల నరికాడు. పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తే ఇలా ఘోరంగా నరికి చంపాడు. కర్ణాటకలో మదికెరి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ బాలికతో నిశ్చితార్థం చేసుకుంటుండగా అధికారులు వచ్చి అడ్డగించారు. మైనర్‌కి పెళ్లి చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఫలితంగా ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది. ఆ తరవాత కొద్ది గంటలకే ఈ దారుణానికి ఒడిగట్టాడు యువకుడు. నరికిన తలని తీసుకుని నిందితుడు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసిన బాలికకు పెళ్లి చేయడాన్ని స్థానికులు వ్యతిరేకించారు. నిశ్చితార్థం జరుగుతుండగా అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి వచ్చి నిశ్చితార్థాన్ని నిలిపివేశారు.
బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ తరవాత కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లిని రద్దు చేసుకునేందుకు వాళ్లు అంగీకరించారు. 18 ఏళ్లు వచ్చిన తరవాతే తమ కూతురికి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా జరిగిన కొద్ది గంటలకే యువకుడు బాలిక ఇంట్లో చొరబడ్డాడు. ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఆమె తండ్రిని కాలితో తన్నాడు. బాలిక తల్లిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. బాలిక జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తల నరికేశాడు. ఆ తల పట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీలైనంత త్వరగా పట్టుకుంటామని వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

