అన్వేషించండి

Kamareddy News : ఇద్దరు చిన్నారులను వాగులో పడేసిన తల్లి, ఆ తర్వాత ఆటో డ్రామా!

Kamareddy News : కామారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైన కేసులో తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల్ని వాగులో పడేసిన తల్లి ఆటో డ్రామా ఆడింది.

Kamareddy News : కామారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల మృతి కేసులో కన్న తల్లే దోషిగా తేలింది.  బాన్సువాడ టౌన్ లో సోమవారం రాత్రి వెలుగు చూసిన ఇద్దరు చిన్నారుల మృతి కేసులో కన్న తల్లే వారిని చంపినట్లు తేలింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అరుణను మహారాష్ట్రలోని ఉద్గిర్ కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి నాలుగేళ్ల కొడుకు, ఆరు నెలల కూతురు ఉంది. కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా తల్లి ఇంటిలో ఉంటుంది అరుణ. సోమవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకొని బస్సులో బాన్సువాడకు వెళ్లింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో వాగు కాల్వలో ఇద్దరు పిల్లలను పడేసి తాను దూకింది. లోతు తక్కువగా ఉండడంతో అరుణ చనిపోలేదు. ఇద్దరు పిల్లలను కొద్దిసేపటి తర్వాత బయటకు తీసుకొచ్చింది. అయితే అప్పటికే పిల్లలు చనిపోయారు. పిల్లలను ఓ ఆటో డ్రైవర్ పడేసినట్లు పోలీసులకు చెప్పింది. అరుణను పోలీసులు విచారించారు. చివరకు చిన్నారులిద్దరిని తానే వాగులో పడేసినట్లు ఒప్పుకుంది నిందితురాలు అరుణ. దీంతో పోలీసులు అరుణను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

అసలేం జరిగింది? 

క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. చిన్న చిన్న తగాదాలు మనస్పర్థలతో ఆత్మహత్యలు చేసుకుంటూ నవమాసాలు మోసి కన్న బిడ్డలను కూడా కడతేర్చుతున్నారు. సోమవారం రాత్రి బాన్సువాడలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న పెద్ద పూలు వాగులో ఇద్దరు చిన్నారులను నీటిలో పడవేసిందో తల్లి. తర్వాత తాను చనిపోదామని అనుకుని వాగులో దూకింది. లోతు తక్కువగా ఉండడంతో ఆమె చనిపోలేదు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ తాలూకాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ అరుణ తన తల్లి ఇంటిలో ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలోని నాగారం గొల్లగట్టు తండా నుంచి పిల్లలను యువరాజ్(4), అనన్య(6 నెలలు) పాపతో కలిసి బాన్సువాడలోని బస్ డిపో సమీపంలో గల పెద్ద పూలు బ్రిడ్జి వద్ద వాగులో దూకింది. వాగు లోతు తక్కువగా ఉండడంతో అరుణ బతికిబయటపడింది. వాగులో మునిగి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. 

ఆటో డ్రామా 

ఈ కేసుపై డీఎస్పీ జగన్నాథ రెడ్డి మాట్లాడుతూ... పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అరుణ ఆటో డ్రామాకు తెరలేపడంతో అన్ని కోణాల్లో కేసును విచారించమన్నారు. ఈనెల 24న జాదవ్ అరుణ సోదరుడు తిరుపతికి వెళ్లి తిరిగి రావడంతో అరుణ తల్లి గారింటికి నిజామాబాద్ రావడం జరిగిందన్నారు. సోమవారం రోజున ఆమె భర్త మోహన్ ఇంటికి రమ్మని చెప్పడంతో అరుణ నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో బాన్సువాడకు వచ్చిందన్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ లను సాక్ష్యాధారాలను బట్టి అరుణ బాన్సువాడ డిపోకు చెందిన  ఆర్టీసీ బస్సులో వచ్చి బస్సు డిపో వద్ద గల నారాయణరెడ్డి బోర్వెల్ కార్యాలయం వైపు వెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయిందన్నారు. అలాగే చేపూరి బార్ అండ్ రెస్టారెంట్ సీసీ టీవీ ఫుటేజ్ లో వాగు వైపు వెళ్తున్నట్లు కనిపించడంతో దర్యాప్తును అన్ని కోణాల్లో చేసినట్లు తెలిపారు. అరుణను విచారించగా తానే పిల్లలను చంపినట్లు నేరాన్ని ఒప్పుకుందన్నారు. దీంతో అరుణను అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు. కేసులో ఆధునిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందన్నారు.  అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget