అన్వేషించండి

Selfie Video Viral: మైదుకూరు సీఐ బెదిరిస్తున్నారు... కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో... ఘటనపై స్పందించిన సీఎం

నంద్యాలలో సలాం కుటుంబంతో ఆత్మహత్య ఘటన మరవక ముందే మరో సెల్ఫీ వీడియో కలకలంరేపుతోంది. తన భూమి ఆక్రమించుకున్నారని పోలీసుల దగ్గరికి వెళితే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

నంద్యాలలో సలాం కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరవక ముందే ఇంకో ఘటన వెలుగులోకి వచ్చింది. తన భూమి ఆక్రమించుకున్నారని పోలీసుల దగ్గరికి వెళితే వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో పెట్టారు. పోలీసులు ఎన్ కౌంటర్ కన్నా ముందే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నాడు. 

వైసీపీ నేతతో భూవివాదం 

కడప జిల్లా మైదుకూరు రూరల్ సీఐ, డీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ల నుండి ప్రాణహాని ఉందని అక్బర్ బాషా అనే వ్యక్తి పెట్టిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. దువ్వూరు మండలానికి చెందిన ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డితో జరుగుతున్న  భూవివాదంలో మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని  అక్బర్ బాషా ఆరోపించారు. తనకు న్యాయం చేయక పోగా స్టేషన్ లోనే ఎన్ కౌంటర్ చేస్తానని సీఐ కొండారెడ్డి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం స్పందించాలని వినతి

కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన మిద్దె అక్బర్ బాషకు దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామంలో దాన విక్రయం కిందట ఎకరం పొలం  రిజిస్టర్ చేయించుకున్నాడు. కానీ రెండు సంవత్సరాల క్రితం జోన్నవరం  రామలక్ష్మి రెడ్డి అనే వ్యక్తికి అదే పొలాన్ని అక్బర్ అత్త అమ్మడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. ఈ కేసు విత్ డ్రా చేసుకోమని సీఐ కొండారెడ్డి, ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి తమను బెదిరిస్తున్నారని అక్బర్ ఆరోపిస్తున్నారు. కేసు వెనక్కి తీసుకోకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కలగజేసుకుని 48 గంటల్లో తమకు న్యాయం చేయకుంటే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని అక్బర్ భాష ఇంటర్ నెట్ లో సెల్ఫీ వీడియో  పెట్టారు. 

చంద్రబాబు ట్వీట్ 

ఈ సెల్ఫీ వీడియోపై చంద్రబాబు స్పందించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దారుణ వార్త వినాల్సి వస్తోందని ఆరోపించారు. మైదుకూరులో  వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందన్నారు. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయిందని విమర్శించారు.

వారంలో పరిష్కరించాలని సీఎం ఆదేశం

కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం సోషల్‌ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియో ఘటనపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడినట్లు సమాచారం. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్‌ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

రాత్రే స్పందించాం: ఎస్పీ 

అంతకముందు సెల్ఫీ వీడియో చేసిన అక్బర్‌ బాషా కుటుంబంతో ఎస్పీ మాట్లాడారు. బాధిత కుటుంబం, కడప వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. అక్బర్‌బాషా సెల్ఫీ వీడియోపై శుక్రవారం రాత్రి 11.20 గంటలకు స్పందించామని తెలిపారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్‌ పిటిషన్‌ ఇచ్చారు. సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించామని ఎస్పీ తెలిపారు. సీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించామన్నారు. భూవివాదం పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చిందని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. 

 

Also Read: AP Crime: కడప జిల్లాలో దారుణం.. మహిళలపై ఆగంతకుల దాడి.. బంగారు గొలుసుల అపహరణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs MI Match Highlights IPL 2024 | Travis Head | వార్నర్ లేని లోటును తీరుసున్న ట్రావెస్ హెడ్SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్ | ABPSRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya | SRH, MI అంతా ఒక వైపు.. పాండ్య ఒక్కడే ఒకవైపు.!SRH vs MI Match Highlights IPL 2024: రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన ముంబయి, కెప్టెనే కారణమా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
Embed widget