Hyderabad IPL Betting: హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ - 12 మంది అరెస్ట్, ఐదుగురు పరార్
Hyderabad IPL Betting: హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మరో ఐదుగురు పరారయ్యారు.
Hyderabad IPL Betting: హైదరాబాద్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో మరో ఐదుగురు నిందితులు తప్పించుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేష్న పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు వేర్వేరు టీంలో 12 మంది బుకీలు, ఆపరేట్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకోబోతుండగా మరో ఐదుగురు తప్పించుకున్నారు. సులభంగా డబ్బులు సంపాధించడం కోసం ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. నిందితుల్లో వసంత్ కుమార్, పొండూరి వెంకట సాయి, కలిదిండి రామరాజు, K.రమేష్ లు ఒక బెట్టింగ్ సెంటర్ లో.. Ch.కార్తీక్, బాదమ్ వీరేష్, బి.శివ కుమార్, మనోజ్ కుమార్, చంద్ర మోహన్ రావ్, సతీష్ కుమార్, సత్యనారాయణ, రవి వర్మలు మరో బెట్టింగ్ సెంటర్ లో దొరకగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. అయితే వీరి నుంచి అయ్యప్ప, కుమార్, పాండు, షేక్ జిలానీ, ప్రభాకర్ లు పరారు అయినట్లు వెల్లడించారు.
నిందితుల నుంచి పోలీసులు 50 లక్షల రూపాయల నగదుతో పాటు 8 ల్యాప్ టాప్ లో, ఒక ఐఫోన్, 5 లైన్ బోర్డులు, నాలుగు టీవీలు, మూడు కీబోర్డులు, ఒక మౌస్, వైఫై రూటర్, ఇయర్ పాడ్, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ వివరించారు. అలాగే 3 లక్షల 29 వేల రూపాయలను బ్యాంకులో సీజ్ చేశామని చెప్పారు. అయితే స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ కోటి 41 లక్షల 52 వేల 548 రూపాయలు అని స్పష్టం చేశారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని, మిగిలిన ఐదుగురుని కూడా త్వరలోనే పట్టుకుంటామని మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వెల్లడించారు.
రెండ్రోజుల క్రితం 9 మంది అరెస్ట్
సోమవారం నాడు RCB Vs CSK! ఇలాంటి స్టార్‌వార్ వచ్చినప్పుడు సగటు ప్రేక్షకుడికే ఆసక్తి, ఉత్కంఠ ఎక్కువ! అలాంటిది బెట్టింగ్ బాబులకు ఇంకెంత ఇంట్రస్ట్ ఉండాలి! ఇలాంటి మ్యాచులు జరిగినప్పుడే కదా.. నాలుగు కట్టలు వెనకేసుకునేది! పోలీసులు ఊహించిందే నిజమైంది! ఒక విశ్వసనీయ సమాచారం- లక్షల రూపాయల అక్రమ దందాను బ్రేక్ చేసింది. సైబరాబాద్ కమిషనరేట్‌లోని SOT పోలీసులు, రాజేంద్రనగర్ జోన్, మొయినాబాద్ పోలీసు బృందం కలసి.. ఓ ఫామ్ హౌస్‌పై దాడి చేశారు. సరిగ్గా రాత్రి 10.45కి జాయింట్ ఆపరేషన్ స్టార్టయింది. ఒక్కసారిగా ఫామ్‌హౌజ్ చుట్టూ రౌండప్ చేస్తే, బుకీలు దొరికారు. పంటర్లు షార్పుగా తప్పించుకున్నారు. ఫోన్లు, లాప్‌టాప్స్, కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఈ రెయిడ్‌లో ముగ్గురు బుకీలు దొరికారు. 2 స్కోర్ పేపర్లు కనిపించాయి. ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లు, రూ. 40 లక్షల లిక్విడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లో రూ. 12,10,054 క్యాష్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ ఒక్క మ్యాచ్ కోసమే సుమారు రూ. 53 లక్షల ట్రాన్సాక్షన్ (ఆన్ లైన్/ఆఫ్ లైన్) సాగినట్టు పోలీసులు వెల్లడించారు.
నమోదు చేసిన FIR ప్రకారం A1, A5, A6, A7, A8, A9 నిందితులు పరారీలో ఉన్నారు. వీళ్లంతా పంటర్లని పోలీసులు పేర్కొన్నారు. A-1 నిందితుడు శంకర్. ఇతనిది కూకట్‌పల్లి. మెయిన్ నిర్వాహకుడు. A-5 భాస్కర్. ఇతను పంటర్. A6- సిద్ధు. ఇతను కూడా పంటరే. A-7 మల్లి, A-8 సాయిరెడ్డి, A-9 బాషా.. -వీళ్లంతా పంటర్లే! ఇకపోతే, A-2 తిరుపతయ్య. పట్టుబడిన ఇతను బుకీ. బియ్యం వ్యాపారం చేస్తుంటాడు. A-3 నిందితుడు- పెద్దిగారి నాగరాజు. ఇతనూ బిజినెస్‌మేన్. సొంతూరు మాల్తుమ్మెద గ్రామం, కామారెడ్డి జిల్లా. A-4 పాగల మల్లా రెడ్డి. ఈయన బిల్డర్. సొంతూరు సిద్దిపేట జిల్లా, తొగుట. ఇతను నాగరాజు అనే వ్యక్తికి సహాయకుడిగా ఉన్నాడు.