News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కొలీగ్ వేలు కొరికినందుకు ఇండియన్‌కి పది నెలల జైలు శిక్ష, సింగపూర్‌లో అంతే

Singapore Crime: సింగపూర్‌లో ఓ వ్యక్తి సహోద్యోగి వేలు కొరికినందుకు 10 నెలల పాటు జైలు శిక్ష విధించారు.

FOLLOW US: 
Share:

Singapore Crime: 

ఇండియన్‌కి శిక్ష..

ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి చట్టాలు. చిన్న చిన్న తప్పులకే పెద్ద శిక్షలు వేస్తుంటారు. నేరం చిన్నదైనా, పెద్దదైనా నేరస్థుడికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే అని కొన్ని ప్రభుత్వాలు తేల్చి చెప్పేస్తాయి. ఇలా చాలా మంది బాధితులవుతుంటారు. సింగపూర్‌లో 40 ఏళ్ల ఇండియన్‌ ఇలాగే శిక్షకు గురయ్యాడు. ఓ పార్టీలో మద్యం మత్తులో ఉండగా ఓ వ్యక్తి చూపుడు వేలు కొరికాడు. ఎక్స్‌కవేటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న తంగరసు రంగసామి మద్యం మత్తులో సహోద్యోగి వేలు కొరికాడు. ఆ బాధితుడు కూడా ఇండియనే. గతేడాది ఏప్రిల్‌లో డార్మిటరీలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారు. రంగసామి అప్పటకి ఫుల్‌గా తాగాడు. గట్టిగా అరుస్తుండటం వల్ల చుట్టు పక్కల వాళ్లు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని చెబుతూ "అరవొద్దు" అని వారించాడు మరో బాధితుడు రామమూర్తి. ఇలా వార్నింగ్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తంగరసు గొడవకు దిగాడు. చాలా సేపు వీళ్లిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పక్కనే ఉన్న వాళ్లు ఆపాలని చూసినా ఆగలేదు. ఈ గొడవలోనే అనుకోకుండా రామమూర్తి ఎడమ చేతి వేలు తంగరసు నోట్లోకి వెళ్లిపోయింది. వెంటనే గట్టిగా కొరికేశాడు తంగరసు. కొన్ని సెకన్ల తరవాత ఎలాగోలా వేలుని బయటకు లాగేసుకున్నాడు రామమూర్తి. విపరీతంగా రక్తం పోవడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొరికేసిన తరవాత ఆ వేలు ముక్క ఎక్కడ పడిందో కూడా తెలియదు. వైద్యులు వేలికి సర్జరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు...నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 నెలల జైలు శిక్ష విధించారు. సింగపూర్ చట్టాల ప్రకారం...ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఆ నేర తీవ్రతను బట్టి పదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. 

మహిళకు ఉరి శిక్ష

సింగపూర్ లో ఓ మహిళకు ఉరి శిక్ష పడింది. గడిచిన 20 సంవత్సరాల కాలంలో తొలిసారి శుక్రవారం ఓ మహిళను ఉరి తీసింది సింగపూర్ ప్రభుత్వం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు దోషులకు సింగపూర్‌ ప్రభుత్వం మరణి శిక్ష విధించింది. 2018లో వీళ్లను అరెస్టు చేశారు.హెరాయిన్‌ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు దోషులను సింగపూర్‌ పోలీసులు 2018లో పట్టుకున్నారు. వారిలో ఒకరు 56 ఏళ్ల వ్యక్తి కాగా అతనిని బుధవారం ఉరి తీశారు. కాగా ఆ వ్యక్తితో పాటు అరెస్ట్‌ అయిన మహిళను శుక్రవారం ఉరి తీశారు. ఉరి తీసిన మహిళ పేరు సారిదేవి దామని. ఆమె వయసు 45 ఏళ్లు. 30 గ్రాముల హెరాయిన్‌ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో ఆమెకు కూడా 2018లో ఉరిశిక్ష విధించారు. ఇద్దరు వ్యక్తుల ఉరి శిక్ష గురించి వారి కుటుంబాలకు వారం రోజుల ముందుగానే సమాచారం అందించారు. గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. 2004 లో ఓ 36 ఏళ్ల మహిళకు డ్రగ్‌ ట్రాఫికింగ్‌ కేసులో ఉరిశిక్ష అమలు చేశారు. 

Also Read: Noida Lift Collapse:లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

Published at : 15 Sep 2023 05:06 PM (IST) Tags: Singapore Crime Singapore Crime News Indian Jailed Biting Finger

ఇవి కూడా చూడండి

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

టాప్ స్టోరీస్

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?