అన్వేషించండి

Noida Lift Collapse:లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

Noida Lift Collapse: లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం.


నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం నుంచి లిఫ్ట్‌ కూలిపోయి నలుగురు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. ఆమ్రపాలి హౌసింగ్‌ సొసైటీకి చెందిన నిర్మాణంలో ఉన్న భవనంలో ఇది జరిగింది. 14వ అంతస్థు నుంచి సర్వీస్‌ లిఫ్ట్‌ కూలిపోయింది. అధికారులు ప్రమాద ప్రాంతంలో సహాయకచర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఘటన జరిగినట్లు అడిషనల్‌ డీసీపీ (సెంట్రల్‌ నోయిడా) రాజీవ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.

లిఫ్ట్‌ కూలిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని గౌతమబుద్ధ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ మనీష్‌ వర్మ వెల్లడించారు. నలుగురు వ్యక్తులు చనిపోయారు, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది, సిటీ హాస్పిటల్‌లో వైద్యం జరుగుతోంది. ఆస్పత్రిలో అధికారులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో కూడా అధికారులు ఉన్నారు, అక్కడ ఇంకెవ్వరూ చిక్కుకుపోలేదు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తున్నామని వర్మ తెలిపారు. 

ఇటీవల మహారాష్ట్రలో లిఫ్ట్‌ కూలి ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని థానేలో నాలుగు రోజుల క్రితం సెప్టెంబరు 11న ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్‌ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. థానేలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం టెర్రస్‌పై వాటర్‌ ప్రూఫింగ్‌ పనులు పూర్తి చేసుకుని కార్మికులు కిందకు వస్తుండగా లిఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తి వైరు తెగిపోవడంతో కూలిపోయింది. లిఫ్ట్‌ వేగంగా కిందకు పడడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగింది కూడా పెద్ద హై రైజ్‌ బిల్డింగ్‌లోనే. లిఫ్ట్‌ ఏకంగా 40వ అంతస్థు నుంచి కూలిపోయి అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ ఏరియా P3 వద్ద పడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఇటీవల కాలంలో నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాలలో పెద్ద భవనాల్లో లిఫ్ట్‌ కూలిపోవడం, లిఫ్ట్‌లలో సమస్యలు తలెత్తడం వంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆగస్టులో నోయిడాలోని ఓ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో లిఫ్ట్‌ క్రాష్ అవ్వడంతో 73 ఏళ్ల మహిళ గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటనలో లిఫ్ట్‌ క్రాష్‌ అయ్యింది కానీ కింద నేలకు వచ్చి తగలలేదు. మధ్యలో ఏదో ఒక అంతస్థు వద్ద ఆగిపోయింది. కానీ ఆ మహిళ గుండెపోటుతో చనిపోయింది.

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Web Security: ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ యూజ్.. ఈ పొరపాట్లు వద్దంటూ కేంద్రం కీలక సూచనలు!
ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ యూజ్.. ఈ పొరపాట్లు వద్దంటూ కేంద్రం కీలక సూచనలు!
Prithvi Shaw Warning: యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Kagaznagar News: స్కూల్‌లో బలవంతపు బైబిల్ బోధన కలకలం.. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేసిందని తండ్రి ఆరోపణ
స్కూల్‌లో బలవంతపు బైబిల్ బోధన కలకలం.. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేసిందని తండ్రి ఆరోపణ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Embed widget