అన్వేషించండి

IBomma Ravi gets bail: ఐబొమ్మ రవికి బెయిల్ - ఇంటర్నెడ్ వాడకూడదని షరతు

Ravi Bail: ఐబొమ్మ రవికి బెయిల్ లభించింది. అయితే విదేశాలకు వెళ్లకూడదని.. ఇంటర్నెట్ వాడకూడదని కోర్టు షరతులు విధించింది.

I Bomma Ravi granted conditional bail: సినిమా పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma)  వెబ్‌సైట్ నిర్వాహకుల్లో ఒకరైన రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొంతకాలంగా సినిమా పైరసీ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన ఈ పైరసీ వ్యవహారంలో రవి పాత్రపై లోతైన విచారణ జరిపిన పోలీసులు, పక్కా ఆధారాలతో అతడిని అరెస్ట్ చేశారు.         

కఠినమైన షరతులు విధించిన కోర్టు           

బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కోర్టు అత్యంత కఠినమైన ఆంక్షలను విధించింది. నిందితుడు రవి ప్రతిరోజూ  హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)  అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.           

ఇంటర్నెట్ వాడాలంటే అనుమతి తీసుకోవాలి !                    

మరో కీలకమైన అంశం ఏమిటంటే, రవి తన  పాస్‌పోర్ట్‌ను తక్షణమే కోర్టులో సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. దీనివల్ల నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా పోలీసులు నిఘా ఉంచనున్నారు.  అన్నిటికంటే   కఠినమైన షరతు  ఇంటర్నెట్ వాడకం పై విధించిన ఆంక్ష. వృత్తిరీత్యా ఐటీ నైపుణ్యం ఉన్న వ్యక్తి కావడంతో, రవి ఇంటర్నెట్‌ను ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే, ఖచ్చితంగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.        

గత ఏడాది నవంబర్ లో అరెస్టు                     

ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నారనే ఆరోపణలతో రవిని గత ఏడాది  నవంబర్ 16న అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం, ఈ కుంభకోణంలో మరిన్ని వివరాలను రాబట్టడానికి కోర్టు అతడిని  పలుమార్లు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.  ఈ కస్టడీ సమయంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని క్షుణ్ణంగా విచారించారు. విచారణలో పోలీసులు అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. రవి విదేశాల్లో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఈ పైరసీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, ఇతర భాషల చిత్రాలను కూడా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్‌డి క్వాలిటీతో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవారని తేలింది. ఈ ప్రక్రియ ద్వారా వారు భారీగా ప్రకటనల ఆదాయాన్ని గడిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రవి ఐటీ నైపుణ్యాన్ని ఉపయోగించి సెర్వర్లను పక్కదారి పట్టించడం, పోలీసులకు చిక్కకుండా టెక్నికల్ జాగ్రత్తలు తీసుకోవడంలో సిద్ధహస్తుడని విచారణలో వెల్లడైంది. తాజాగా అతడికి బెయిల్ మంజూరైనప్పటికీ, ఇంటర్నెట్ వాడకూడదనే కఠినమైన షరతు విధించడానికి అతడికున్న ఈ సాంకేతిక పరిజ్ఞానమే ప్రధాన కారణం.


  

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
RTC Driver, Conductor Attacked: అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget