By: ABP Desam | Updated at : 23 Feb 2023 11:45 PM (IST)
బిల్డింగ్ పైనుంచి పడి అంధ విద్యార్థి మృతి
Student Dies after fell down from top of Building: హైదరాబాద్ లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. అంధ విద్యార్థుల స్కూల్లో అనుకోని విషాదం జరిగింది. బిల్డింగ్ పైనుంచి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కేర్ టేకర్ బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Student Dies Devanar Blind School: విద్యార్థి లక్ష్మీగౌతమ్ శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేవనార్ అంధ పాఠశాలలోని తోటి విద్యార్థులు తన స్నేహితుడు ఇకలేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థి అకాల మరణం పట్ల అంధ పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అంధ పాఠశాలలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన చోటు నుంచి..
ఘటనాస్థలికి చేరుకున్న బేగంపేట్ పోలీసులు మృతుడు 6వ తరగతి చదువుతున్న ఖైరతాబాద్ కు చెందిన వీ రవికుమార్, గౌతమ్ లక్ష్మి దంపతుల తనయుడు అంధ విద్యార్థి గౌతం (12)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని ఎస్ ఐ చక్రవర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పీ శ్రీనివాస్ రావు తెలిపారు. లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన రంద్రం నుండి 5వ అంతస్తు నుండి కింద పడినట్లు తెలిపిన సిబ్బంది.. ఇది ఉదయం 11గంటలకు జరిగినప్పటికీ ఇప్పటివరకు గోప్యంగా ఉంచడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కుక్కల దాడిలో బాలుడు..
నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అంబర్ పేట చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు.
ఆదివారం రోజు సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటూ ఉండగా.. మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ వేరే ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్.. ఆ తర్వాత తన అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కాలయముల్లా ఆ వీధి కుక్కలు మాత్రం బాలుడిపైకి వస్తూనే ఉన్నాయి. బాలుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వదలకుండా ఆ పసివాడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. మూడు కుక్కలు బాలుడిని ఈడ్చుకెళ్తూ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బాలుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!
Adivasi Mahasabha: గిరిజన యువకులు, విద్యార్థుల డెత్ మిస్టరీ- సమగ్ర విచారణకు ఆదివాసీల డిమాండ్
YSR Kadapa News: కడపలో సంచలనం సృష్టిస్తున్న అధికారి మృతి- తోటి ఉద్యోగులపైనే అనుమానం!
Guntur News : గుంటూరులో బెంజ్ కారు బీభత్సం, మత్తులో ఉన్న డ్రైవర్ కు దేహశుద్ధి
Tirupati Cyber Crime : ఆర్మీ క్యాంటీన్ లో తక్కువకే సరుకులు, పూర్వ విద్యార్థినంటూ ప్రొఫెసర్ డబ్బుకొట్టేసిన కేటుగాళ్లు!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!