Hyderabad Crime : ఉపాధి పేరుతో వ్యభిచారం, హైదరాబాద్ లో ముఠా అరెస్టు
Hyderabad Crime : ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోన్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. యువతులను బంగ్లాదేశ్ నుంచి అక్రమ రవాణా చేశారని పోలీసులు తెలిపారు.
Hyderabad Crime : హైదరాబాద్ లో హ్యూమల్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచార ఉచ్చులో దించిందో ముఠా. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళల అక్రమ రవాణా దేశంలో పెద్ద నేరమన్నారు. మహిళలను అక్రమ రవాణా చేసి వ్యభిచారం కుంపటిలో దింపుతున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందన్నారు. జులై 11న ఉప్పల్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు విచారణ చేశామన్నారు.
ఫేక్ ఆధార్ కార్డులతో నగరానికి
హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన గ్యాంగ్ లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. ఝర్ఖండ్ కు చెందిన సతీష్ రాజాక్ ఈ కేసులో ప్రధాన సూత్రదారి అన్నారు. బంగ్లాదేశ్, ఝర్ఖండ్, రాజస్థాన్ , మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిపారు. ఇద్దరు విదేశీ యువతులను రక్షించినట్లు వెల్లడించారు. బాధితుల్లో 15 సంవత్సరాల బాలిక ఉన్నట్లు తెలిపారు. దీపక్ చంద్ అనే యువకుడు హైదరాబాద్ లో ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఫేక్ ఆధార్ కార్డ్స్ తో యువతులను బంగ్లాదేశ్ నుంచి అక్రమ రవాణా చేశారన్నారు. కోల్ కత్తాకు చెందిన ఇద్దరు అమ్మాయిలను రక్షించినట్లు స్పష్టం చేశారు. షిఫ్ట్ కార్, ఏడు మొబైల్స్ , సిమ్ కార్డ్స్, నకిలీ సర్టిఫికెట్స్ నిందితులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
#Intercountry_HumanTrafficking racket busted by #RCKPolice apprehended 6 traffickers of #Bangladesh, #Maharastra, #Rajasthan & #Jharkhand & rescued 2 Bangladeshi victims including #MinorGirl from their confinement - seized mobile phones & #FakeIdentity cards from their possession pic.twitter.com/MxBrOD5zeZ
— Rachakonda Police (@RachakondaCop) July 22, 2022
Also Read : Vijayawada News: అమ్మాయిల ఫొటోలే పెట్టుబడిగా ఆన్‌లైన్ దందా- విజయవాడలో వెలుగు చూసిన చీటర్ బాగోతం
Also Read : Visakha Crime : విశాఖలో దారుణ ఘటన, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ!