By: ABP Desam | Updated at : 23 May 2022 04:17 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు ప్రెస్ మీట్
Hyderabad Ganja Seize : హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుపడింది. గంజాయి రవాణాకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు స్మగర్లు. మహిళలను స్మగ్లింగ్ దందా దింపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళలకు కమీషన్ ఆశ చూపి గంజాయిను తరలిస్తోంది ఓ గ్యాంగ్. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను సోమవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 మంది స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 470 కిలోల గంజాయి, 4 కార్లు, 11 సెల్‌ఫోన్లు, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
#InterState #DrugPeddlers nabbed by @HayathnagarPS of #RachakondaCommissionerate and #seized 470Kgs of #contraband #ganja, 4 cars and net cash of Rs 2lakhs all W/Rs.1.20 crores #recovered from their possession.@AcpVPuram @DCPLBNagar pic.twitter.com/8sHp6ESqRb
— Rachakonda Police (@RachakondaCop) May 23, 2022
470 కిలోల గంజాయి సీజ్
రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరాలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్రీకాంత్, రాహుల్ ఇతర రాష్ట్రాల్లోని గంజాయి డీలర్లతో సంబంధాలు పెట్టుకుని సీక్రెట్ గా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి గ్రామం నుంచి నాలుగు వాహనాల్లో 470 కిలోల గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశామన్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించారన్నారు. నిందితులు గంజాయిని వేరే కారులోకి మారుస్తున్నప్పుడు అదుపులోకి తీసుకున్నామని అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారంతో మరో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వాళ్లను త్వరలో పట్టుకుంటామని అదనపు సీపీ సుధీర్‌బాబు మీడియాకు వెల్లడించారు.
ఇటీవల 800 కిలోల గంజాయి పట్టివేత
ఇటీవస హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. పత్తి విత్తనాల పేరుతో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని ఉత్తరప్రదేశ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు యూపీ వాసులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Jagityal Man Kindnapped: ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్ - కాళ్లు, చేతులు కట్టేసిన ఫొటోతో రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్స్
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Tirupati Police Thiefs : దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?
Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్
Sri Satyasai District Auto Accident: ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- బాధితులకు రూ. 10 లక్షల పరిహారం- రూ. 50 లక్షలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్
Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల