అన్వేషించండి

Hyderabad News: ఆసిఫ్‌నగర్‌ హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు, ప్రతీకారం కోసమే దారుణం

Hyderabad Crime News: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జరిగిన హత్యకు ప్రతీకారంగానే యువకుడిని చంపారని పోలీసులు తెలిపారు.

Hyderabad Police News: హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రోడ్డు పై ఒక వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఆ వ్యక్తి పై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఐదుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల సోదరుడిని హత్య చేసినందుకు ప్రతీకారంగానే యువకుడిని చంపినట్లు  పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య జంట నగరాల్లో సంచలనంగా మారింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో  సయ్యద్ తాహెర్ (27), సయ్యద్ ఇమ్రాన్ (24), సయ్యద్ ముజఫర్, సయ్యద్ అమన్, షేక్ జావీద్ ఉన్నారు.

కత్తితో పొడిచి, రాళ్లతో కొట్టి దారుణం.. 
ఈ నెల 13వ తేదీన ఆసిఫ్ నగర్ ప్రాంతంలో  రోడ్డు పై మొహమ్మద్ కుతుబుద్దిన్ అనే 27సంవత్సరాల యువకుడిని దారుణంగా చంపారు.  కత్తి, కర్రలు, బండ రాయితో కొట్టి అతి కిరాతకంగా ఐదుగురు వ్యక్తులు కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

ప్రతీకారంతోనే హత్య
మృతుడు గతంలో ఓ హత్య కేసులో ఉన్నాడు. ఆ హత్యకు ప్రతీకారంగానే ఈ యువకుడిని హతమార్చినట్లు డీసీపీ  స్నేహ మెహ్రా తెలిపారు. అరెస్ట్ అయిన ఐదుగురు నిందితుల్లో A1 సయ్యద్ తహేర్, A2 సయ్యద్ ఇమ్రాన్,  A3 సయ్యద్ అమాన్, A4 సయ్యద్ ముజఫ్ఫార్ A5 షేక్ జావిద్ ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో  ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు.  2023లో ఆసిఫ్‌నగర్‌లోని ఓ బార్ సమీపంలో నిందితులు తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్‌ల సోదరుడైన ముజాహెద్‌ను మృతుడు మహ్మద్ కుతుబుద్దీన్ హతమార్చినట్లు డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. హత్యానంతరం కుతుబుద్దీన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.  

ఎలాగైనా మట్టుబెట్టాలని.. 
తాహెర్, అతని సోదరులు ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు.  వారి ఇతర బంధువుల సాయంతో హత్యకు పక్కా ప్రణాళిక రచించారు.  గురువారం రాత్రి బహిరంగంగా రోడ్డుపై కుతుబుద్దీన్‌ ను వెంబడించి.. ఛాన్స్ దొరకగానే  అతని పై కత్తులతో, కర్రలతో దాడి చేశారు. గాయపడిన కుతుబుద్దీన్‌ అక్కడి నుంచి తప్పించుకుని తన అన్న రహీం షాపు దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే అతడిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుతుబుద్దీన్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్, అర్మాన్, జావీద్‌లను అరెస్ట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget