News
News
X

Hyderabad: స్నేహం పేరుతో యువతికి రెండున్నర లక్షల టోకరా, ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్!

Hyderabad News: ఇన్ స్టాగ్రాం ద్వారా పరిచయమై, విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ నమ్మబలికి అమ్మాయి దగ్గర నుంచి రెండున్నర లక్షలు కాజేసిన ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

FOLLOW US: 

Hyderabad News: సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీపీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ ఆయన కార్యాలయంలో అడిషనల్ డీసీపీ స్నేహ మెహర, ఏసీపీ కేవీఎం ప్రసాద్ లతో కలిసి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన, ముక్కూ, మొహం తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపకూడదని పోలీసులు సూచించారు. 

అసలేం జరిగిందంటే..?

బేగంపేటకు చెందిన ఓ యువతికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. యూఎస్ లో ఉంటున్నానని చెబుతూ స్నేహం చేశాడు. చాలా రోజుల పాటు చాటింగ్ చేసిన వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. అయితే స్నేహానికి గుర్తుగా నీకు యూఎస్ నుంచి విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ సదరు యువతిని నమ్మించాడు. ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామని యువతికి ఫోన్ చేసి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆమె ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. రోజుల తరబడి వేచూ చూసినా ఎలాంటి బహుమతీ రాలేదు. అలాగే స్నేహితుడు కూడా మెసేజెస్ కి స్పందించడం మానేశాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన యువతి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నైజీరియాకు చెందిన అల్లోట్ పీటర్ అలియాస్ చిలుజా, రొమాన్స్ జాషువాలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. 

ఇన్ స్టాలో ఝాముండా ఆగడాలు..

News Reels

ఇన్ స్టాగ్రామ్ లో ఝాముడా(Jhamunda), ఝాముండా అఫీషియల్(jhamunda_official), ఝాముండా అఫీషియల్ 2(jhamunda_official_2) అనే పేరుతో ఓ ముఠా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తోంది. ఒక వర్గానికి చెందిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని ఫోటోలు, వీడియోలు తీసి.. ఆ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో పోస్టు చేస్తోంది. అసభ్యకర పదజాలం వాడుతూ ఆ వీడియోపై, ఫోటోలపై కామెంట్లు చేస్తూ వాటిని వైరల్ చేస్తోంది. 

ఒక వర్గం వారే ఆ ముఠా లక్ష్యం

మీరు మీ స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తుంటే.. ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా అనుసరిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు చేసేదంతా షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. వింటుంటే భయమేస్తోందా.. ఝాముండా ఇన్ స్టా పేజీలో జరిగే తతంగం ఇదే. హైదరాబాద్‌లో మోటారు వాహనాల నుంచి మాల్స్ వరకు వివిధ బహిరంగ ప్రదేశాలలో గుర్తు తెలియని వ్యక్తులు.. కొంత మంది యువతీ యువకులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి మా కమ్యూనిటీ పరువు నాశనం చేస్తున్నారంటూ అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తమకు సంబంధించిన పోస్టులు ఇతర వ్యక్తుల నుంచి వారికి చేరడంతోనే బాధితులకు ఈ ముఠా ఆగడాలు తెలుస్తున్నాయి. కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ పేజ్ లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు. అలాగే ఝాముండా పేజ్ పై 506, 509, 354(D) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Published at : 16 Oct 2022 01:15 PM (IST) Tags: Hyderabad crime news Crime News Hyderabad News Nigerians Arrest Instagram Crime News

సంబంధిత కథనాలు

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Bengaluru Rape: బెంగళూరులో ర్యాపిడో గలీజు పని, యువతిపై తెల్లవార్లూ సామూహిక అత్యాచారం!

Bengaluru Rape: బెంగళూరులో ర్యాపిడో గలీజు పని, యువతిపై తెల్లవార్లూ సామూహిక అత్యాచారం!

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్