News
News
X

Hyderabad News : ప్రేమ పెళ్లికి బ్రేక్, లవర్ కు వీడియో కాల్ చేసి లైవ్ లో యువకుడు సూసైడ్

Hyderabad News : హైదరాబాద్ పాతబస్తీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి అవ్వడంలేదని ఓ యువకుడు లవర్ కు వీడియో కాల్ చేసి సూసైడ్ చేసుకున్నాడు.

FOLLOW US: 
 
Hyderabad News : హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నానన్న బాధతో ఓ యువకుడు లవర్ కు వీడియో కాల్ చేసి లైవ్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఓల్డ్‌ సిటీలోని కలాపట్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మహ్మద్‌ తబ్రేజ్‌ అలీ స్థానికంగా ఉండే ఓ అమ్మాయితో ప్రేమయాణం సాగించాడు. ఈ ప్రేమ వివాహానికి ఇద్దరి ఇళ్లలో ముందు ఒప్పుకున్నారు.  అనంతరం కొన్ని రోజులకు రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కారణంతో ప్రేమ పెళ్లికి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య రిలేషన్‌ నడుస్తూనే ఉంది. ఇరు కుటుంబ కలహాలతో తమ పెళ్లికి బ్రేక్ పడిందన్న బాధతో యువకుడు లవర్ కు కాల్‌ మాట్లాడుకుంటూనే లైవ్‌ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి సూసైడ్ పై పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు. 

బాపట్ల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య 

ఏపీ బాపట్ల జిల్లాలోని మున్నంగివారిపాలెంలో ప్రేమ జంట మంగళవారం సూసైడ్ చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మున్నంగివారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు, తేజ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సుబ్బారావు పదోతరగతి వరకు చదివాడు. అతడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తేజ ఇంటర్మీడియేట్ మధ్యలో ఆపేసింది. ఇరువురు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

లాడ్జ్ లో యువతి, యువకుడు సూసైడ్ 

News Reels

తిరుపతిలోని ఓ లాడ్జ్ లో  యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందరాజస్వామి ఆలయ ఉత్తరమాడవీధిలోని ఓ ప్రైవేట్‍ లాడ్జ్ కు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో యువతి, యువకుడు వచ్చారు. లడ్జ్ లో రూమ్ తీసుకున్న వీరిద్దరూ 24 గంటలు గడిచినా బయటకు రాకపోవడంతో లాడ్జ్  నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరూ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం  మృతులు హైదరాబాద్ కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

బెజవాడలో దారుణం

బెజవాడలో 9 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. అత్యాచారనికి పాల్పడ్డ 48 ఏళ్ల ఆఫీజ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. 9 సంవత్సరాల వయస్సు గల బాలిక నివాసం ఉంటున్న పక్కింటిలోనే ఆఫీజ్ కూడా నివాసం ఉంటున్నాడు. చిన్నారి ఇంటి పక్కనే ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆఫీజ్ మాయ మాటలు చెప్పి నోట్లో దుస్తులు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు లేని సమయంలో బాలికను ఏమార్చి తన ఇంటిలోకి తీసుకువెళ్లి హింసించాడు. తరువాత విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది.  తల్లిదండ్రులు చెప్పడంతో స్థానికులు హఫీజ్‌ను నిలదీశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని బుకాయించడంతో అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి కొత్తపేట పోలీసులకు అప్పగించారు. పోలీసులు నుంచి కూడా ఆఫీజ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు బందించి,స్దానిక దిశ పోలీసులకు అప్పగిచారు. దిశ పోలీసుల నుంచి కూడా ఆఫీజ్ ఎస్కేప్‌ అయ్యేందుకు యత్నించాడు. పోలీసులు తమదైన స్టైల్‌లో బంధించారు. 

Also Read : బెజవాడలో బాలికపై అఘాయిత్యం- కేసు నమోదులో పోలీసుల జాప్యం

Published at : 08 Nov 2022 02:37 PM (IST) Tags: Hyderabad Crime News Love Marriage Lover suicide Video call

సంబంధిత కథనాలు

Konaseema News :  ఉసురు తీసిన ఉపాధి,  మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు