Hyderabad News : ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం , ఇంక్యుబేటర్ వేడికి ఇద్దరు పసికందుల మృతి
Hyderabad News : హైదరాబాద్ లో పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఇంక్యుబేటర్ లో పెట్టి వదిలేయడంతో వేడికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![Hyderabad News : ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం , ఇంక్యుబేటర్ వేడికి ఇద్దరు పసికందుల మృతి Hyderabad old city falaknuma private hospital doctors negligence two infants died in Incubator Hyderabad News : ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం , ఇంక్యుబేటర్ వేడికి ఇద్దరు పసికందుల మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/5781a24a482796e605b538b3322cbc4b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad News : హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమాలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఇంక్యుబేటర్‌లో పెట్టి వదిలేయడంతో వేడికి తాళలేక అప్పుడే పుట్టిన ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. శిశువుల ఛాతీ భాగంలో కాలిన గాయాలున్నాయి. వైద్యులు నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇంక్యుబేటర్ లో వేడి వల్లే ఇద్దరు పిల్లలు చనిపోయారని బాధితులు అంటున్నారు. ఉదయం ప్రసవం కాగానే వేడి కోసం శిశువును వైద్యులు ఇంక్యుబేటర్‌లో పెట్టారు. అనంతరం వైద్యులు పిల్లల్ని పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాంశీరగంజ్ ఉన్న కేఏఎమ్ హాస్పిటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆసుపత్రి ముందు బాధితుల ఆందోళన
ఖైరాతబాద్ చింతల్ బస్తీ ప్రాంతానికి చెందిన దంపతులు మంగళవారం ఉదయం కేఏఎమ్ ఆసుపత్రికి వచ్చారు. ఇవాళ ఉదయం వారికి పండంటి మగబిడ్డ పుట్టాడు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపిన వైద్యులు, కొద్ది సేపటికి బిడ్డ శ్వాస సమస్యతో బాధపడుతున్నాడని K.A.M డాక్టర్స్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులకు అనుమానం రావడంతో డాక్టర్లను గట్టిగా నిలదీశారు. అనంతరం ఒక గుడ్డలో చుట్టి బాబును తల్లిదండ్రులకు అప్పగించారు కేఏఎమ్ వైద్యులు. అయితే అప్పటికే బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బిడ్డ ఒంటిపై కాలిన గాయాలను తల్లిదండ్రులు గుర్తించారు. బిడ్డ జన్మించాడని నమోదు చేసిన పేపర్లను K.A.M ఆసుపత్రి సిబ్బంది చింపేశారని చిన్నారులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో హాస్పిటల్ ముందు తల్లిదండ్రులు, బంధువులు నిరసనకు దిగారు. ఈ ఘటనపై ఫలక్ నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
"ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేఏఎమ్ ఆసుపత్రిలో బాబు చనిపోయాడని కంప్లైంట్ వచ్చింది. ఉదయం 7 గంటల సమయంలో మహిళకు డెలవరీ అయింది. బాబు పుట్టాడు. ఆరోగ్య సమస్య ఉందని ఇంక్యుబెటర్ లో పెట్టారు. మధ్యాహ్నం బాబు తల్లిదండ్రులకు అప్పగించారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చిన్నారులను ధరుసలామ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి చిన్నారి చనిపోయాడాని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో బాబు శరీరంపై స్కిన్ వేడికి కాలినట్లు కనిపిస్తుంది. కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం." ఫలక్ నుమా పోలీసులు తెలిపారు.
Also Read : Jagityal Petrol Attack : అధికారులపై పెట్రోల్ తో దాడి చేసిన యువకుడు, ఎంపీవోకు అంటుకున్న మంటలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)