అన్వేషించండి

Hyderabad News: మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ మోసాలు, 50 కోట్లు స్వాహా - ఆందోళనలో బాధితులు

Hyderabad News: మైత్రీ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో వ్యాపారం చేస్తున్న ఓ సంస్థ సడెన్ గా బోర్డు తిప్పేసింది. అమాయకుల నుంచి రూ.50 కోట్ల వరకూ తీసుకొని చేతులెత్తేసింది. 

Hyderabad News: హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇళ్లు కొనుక్కోవాలనుకున్న వారి నుంచి కోట్లు కొల్లగొట్టి చివరకు చేతులెత్తేసింది. జానీ బాషా షేక్ అనే వ్యక్తి మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఆయనే ఎండీగా వ్యవహరిస్తూ.. రాయల్ ప్యారడైజ్ పేరుతో వెంచ్ ఏర్పాటు చేసి రూ.50 కోట్లు ఎగ్గొట్టారు. దీంతో ఇళ్లు కొనేందుకు డబ్బులు కట్టిన బాధితులు మియాపూర్ లోని మైత్రి ప్రాజెక్ట్స్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. సంస్థ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా వారు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న తమ వద్ద నుంచి లక్షలు, లక్షలు తీసుకొని మోసం చేశారని కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.  

ఇటీవలే రియల్ ఎస్టేట్ పేరిట వ్యక్తి మోసాలు, అరెస్ట్ చేసిన పోలీసులు

మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జైత్రి ఇన్ ఫ్రా పేరిట కేపీహెచ్బీ 6వ ఫేజ్ లో ఆఫీసు ఏర్పాటు చేశాడు. ఆపై హైదరాబాద్ శివార్లలోని ఖాళీ భూములను వెతికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. అది తన భూమేనని. అక్కడే తాను అపార్ట్ మెంట్లు కట్టబోతున్నట్లు బాధితులను నమ్మిస్తాడు. ప్రీ లాంచ్, ఆఫర్ల పేరిట 2, 3 బీహెచ్ కే ఇళ్లు ఫ్లాట్లు ఇస్తున్నానంటూ.. చాలా మంది బాధితులను మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5, 10, 15, 20, 25, 40 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు కాజేశాడు. డబ్బులు కట్టిన బాధితులు.. ఏళ్లు గడుస్తున్నా ప్లాట్లు ఇవ్వకపోవడంతో బాధితులు శ్రీనివాస్ ను నిలదీశారు. రేపు, మాపని చెప్పగా కొన్నాళ్లు వేచి చూశారు. అప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి బాధితులు మరోసారి శ్రీనివాస్ ఆఫీసుకు వెళ్లి గొడవ చేశారు. ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ ఆఫీసును మూసేసి మరీ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేపీహెచ్బీ సమీపంలోని పీఎన్ఆర్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే నిందితుడిపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ చంద్ర శేఖర్ తెలిపారు. 

"కాకర్ల శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి జైత్రి ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టి.. ఫ్రీ లాంచ్ పేరిట,  ఆఫర్ల పేరిట 5, 10, 20, 25 లక్షలు వసూలు చేశాడు. మరికొందరి దగ్గర నుంచి అయితే 40 లక్షలు కూడా తీసుకున్నాడు. త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. మూడేళ్లు గడుస్తున్నా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ ప్రారంభం కాకపోవడంతో.. బాధితులు నిలదీశారు. రేపు మాపు అంటూ శ్రీనివాస్ వారిని మోం చేసుకుంటూనే వస్తున్నాడు. బాధితులంతా కలిసి గట్టిగా నిలదీయంతో ఆఫీసును కూడా క్లోజ్ చేసి పారిపోయాడు. దీంతో బాధితులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మేం అరెస్ట్ చేశాం" - చంద్ర శేఖర్, కేపీహెచ్బీ ఏసీపీ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Embed widget