Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!
Nagole Gun Fire : నాగోల్ స్నేహపురికాలనీలో బంగారం షాపులో దుండగులు కాల్పులు జరిపారు. యజమానిని బెదిరించి బంగారం ఎత్తుకెళ్లారు.
Nagole Gun Fire : హైదరాబాద్ నాగోల్ స్నేహపురికాలనీలో కాల్పులు కలకలం రేపాయి. మహదేవ్ జ్యువెలర్స్ లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపాయి. బంగారం షాప్ యజమానిని బెదిరించి దుండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కస్టమర్ల రూపంలో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు అంటున్నారు.
"రాత్రి 9.30 టైంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్లి షట్టర్ క్లోజ్ చేశారు. కాసేపటికి కాల్పులు వినిపించాయి. పక్క షాపుల వాళ్లు వెళ్లి షట్టర్ ఎత్తాం. మమల్ని చూసి ఇద్దరు వ్యక్తులు బయటకు పారిపోయారు. పక్క గల్లీలో బైక్ పెట్టుకున్నట్లు ఉన్నారు. దానిపై పారిపోయారు. వారిని వెంబడిస్తే ఫాస్ట్ గా వెళ్లిపోయారు. షాపులోకి వచ్చి చూస్తే బుల్లెట్స్ ఉన్నాయి. పోలీసులకు ఫోన్ చేశాం. షాపులో వాళ్లకి బుల్లెట్ గాయాలయ్యాయి. వనస్థలిపురం నుంచి ఈ షాపు వాళ్లు బంగారం తీసుకొచ్చారు. వాళ్లను వెంబడించి వచ్చుంటారు. కాల్పులు జరిపి గోల్డ్ తో పరారయ్యాడు. ఇద్దరు గాయపడ్డారు." - స్థానికుడు