Matrimony Cyber Crime : పెళ్లి కాని ప్రసాద్ లను టార్గెట్ చేసిన కిలేడీలు, మ్యాట్రిమోని ప్రొఫైల్ నచ్చిందని లక్షల్లో మోసం
Matrimony Cyber Crime : మ్యాట్రిమోని సైట్ లో మీ ప్రొఫైల్ అప్లోడ్ చేశారు. అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్లు పెళ్లి కాని యువకులకు టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Matrimony Cyber Crime : సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు రోజుకో కొత్తమార్గం వెదుకుతున్నారు. తాజాగా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేశారు. మ్యాట్రిమోని సైట్ లో యువకులు ప్రొఫైల్ చూసి నచ్చారని అప్రోచ్ అవుతారు. తర్వాత అవసరాల పేరుతో రూ.లక్షల్లో మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఓ పెళ్లి కాని యువకుడిని సర్వం దోచేశారు సైబర్ మోసగాళ్లు.
పెళ్లి చేసుకుంటానని రూ.46 లక్షలు మోసం
మ్యాట్రిమోని సైట్ లో మోసగాళ్లు రెచ్చిపోయారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.46 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ కి చెందిన వ్యక్తి మాట్రిమోని సైట్ లో ప్రొఫైల్ పెట్టాడు. తన ప్రొఫైల్ నచ్చిందని పెళ్లి చేసుకుంటానని ఓ యువతి నమ్మించింది. తాను ఇంజనీరింగ్ చదువుతున్నానని అందుకు ఫీజులు కట్టాలని, తన తల్లికి కోవిడ్ వచ్చిందని వివిధ కారణాల చెప్పి లక్షల్లో నగదు కొట్టేసింది చీటర్ లేడి. బాధితుడి వద్ద నుంచి విడతల వారిగా రూ.46 లక్షలు కాజేసింది. ఎంతకీ పెళ్లి మాట ఎత్తకపోవడం, పదే పదే డబ్బు ఇవ్వాలని అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు యువతిని నిలదీశాడు. అప్పటి నుంచి యువతి నుంచి ఎలాంటి సమాచారంలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యాప్ లు, సైట్లతో జాగ్రత్త
మ్యాట్రిమోని సైట్లు, సోషల్ మీడియా, ఇతర యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులతో పరిచయాలు వద్దని చెబుతున్నారు. ఎవరైనా కొత్తవారు మెసేజ్ చేస్తే కాస్త ముందు వెనకా ఆలోచించి స్పందించాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
మెడికల్ సీట్ల పేరుతో రూ.20 లక్షల మోసం
ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామని నమ్మించి రూ.20 లక్షలు కొట్టేశారు సైబర్ చీటర్స్. మోసపోయామని హైదరాబాద్ కి చెందిన ముగ్గురు విద్యార్థులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Cars Thief: పట్టుకోండి చూద్దామన్న దొంగకు పోలీసులు షాక్ - ఏకంగా 10 రాష్ట్రాల్లో కేసులు
Also Read : Palnadu District: అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !