అన్వేషించండి

Hyderabad: ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు! 15 రోజుల పసికందు రూ.80 వేలకి.. కీలక పాత్రధారి ఆమెనే..

5 రోజుల పసి కందును రూ.80 వేలకు అమ్మారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్  పరిధిలో ఈ ఘటన జరిగ్గా.. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కన్న బిడ్డ బరువై అమ్మకానికి తెగబడ్డారు ఈ మానవత్వం లేని తల్లిదండ్రులు. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందని పసికందును వదిలించుకొనేందుకు సిద్ధపడ్డారు. 15 రోజుల పసి కందును రూ.80 వేలకు అమ్మారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్  పరిధిలో ఈ ఘటన జరిగ్గా.. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పసికందు అమ్మమ్మ ఫిర్యాదు చేయగా.. విషయం బయటకు పొక్కింది. అయితే, ఈ వ్యవహారంలో ఓ ఆశా వర్కర్‌ కీలక పాత్ర కూడా ఉంది. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలోని కమలా నగర్‌లో దంపతులు దుర్గప్రియ, శ్రీనివాస్‌ ఉంటున్నారు. శ్రీనివాస్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.  వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత నెల 21న దుర్గప్రియ గాంధీ ఆసుపత్రిలో మూడో కాన్పులో ఆడశిశువును ప్రసవించింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. దీంతో వారిని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన దుర్గప్రియ తల్లి రాజేశ్వరి వారిని ఇంటి వద్ద దిగబెట్టి తన స్వగ్రామైన కర్నూల్‌ జిల్లా ఆలూరుకు వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన పసికందు క్షేమ సమాచారం కోసం ఫోన్ చేయగా.. కూతురు, అల్లుడు ఫోన్ ఎత్తడం లేదు. దీంతో కంగారుపడ్డ ఆమె ఈ నెల 6న ఆమె తిరిగి వనస్థలిపురానికి చేరుకుంది. ఇంట్లో ఆడ శిశువు కనిపించకపోవడంతో వారిని నిలదీసింది. పాపను ఎవరో కిడ్నాప్‌ చేశారని చెప్పగా.. నమ్మశక్యంగా లేకపోవడంతో రాజేశ్వరి వారిపై అనుమాన పడింది. కూతురు, అల్లుడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వెంటనే వెళ్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Also Read: Medaram Prasadam: గుడ్‌న్యూస్.. మేడారం వెళ్లకుండానే ప్రసాదం డోర్ డెలివరీ, ఎలా పొందొచ్చంటే..

మరోవైపు, బాలానగర్‌లో నివాసం ఉంటున్న కవిత అనే మహిళ సోదరి ధనమ్మకు సంతానం లేదు. కవిత నవజాత శిశువు కోసం స్థానిక ఆశా కార్యకర్త బాషమ్మను సంప్రదించింది. ఆమె ఈ విషయాన్ని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దుర్గప్రియ దంపతులకు చెప్పింది. డబ్బు కోసం ఆశ పడిన ఆ దంపతులు రూ.80 వేలకు శిశువును అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఆ ప్రకారమే.. డబ్బుకు శిశువును వారికి ఇచ్చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. తమకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, మళ్లీ అమ్మాయే పుట్టడంతో అమ్మామని నిందితులు తమ పనిని సమర్ధించుకున్నారు. దీంతో నిందితులు దుర్గప్రియ, శ్రీనివాస్‌తో పాటు ధనమ్మ, ఆశా వర్కర్ బాషమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శిశువును ఛైల్డ్‌లైన్‌ సంస్థకు అప్పగించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget