Traffic SI Commits Suicide: బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై ఆత్మహత్య, రైల్వే ట్రాక్ పై తలపెట్టి !
Traffic SI Commits Suicide: బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ్ గిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్ పై తలపెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు.
Traffic SI Commits Suicide: బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్కాజ్ గిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్ పై తలపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అటుగా వెళ్తున్న కొందరు యువకులు రైల్వే ట్రాక్ పై మృతదేహం ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయింది ఎవరనే విషయం తెలుసుకునేందుకు మృతదేహం పాకెట్లలో ఆధారాల కోసం వెతకగా.. ఆయన పర్సు లభించింది. అందులో ఉన్న ఆధారల కారణంగా చనిపోయింది ట్రాఫిక్ ఎస్సై రమణగా గుర్తించారు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఎస్సై రమణ 2020 బ్యాచ్ కు చెందినవారు. అయితే ఎస్సై రమణ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం గురించి మాత్రం ఇంకా ఎలాంటి వివరాలు తెలియలేదు.
ఇటీవలే.. కోడలు జీతాన్ని పుట్టింటికి పంపుతోందని అత్త ఆత్మహత్య
భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను కష్టపడి పెంచింది. కుమార్తెకు పెళ్లి చేసి పంపించగా.. కుమారుడు కూడా ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్న కానుకలు తీస్కురాకుండా వచ్చిన ఆ కోడలు.. తాను సంపాదించే జీతాన్ని కూడా పుట్టింటికే పంపుతోందని హైదరబాద్ కు చెంది ఓ ఓ అత్త ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ ముస్తఫా ప్లాజాలో ఉండే మెరాజ్ సుల్తానా(48) భర్త మఖ్దూం అహ్మద్ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె ఫర్హానా నాజ్, కుమారుడు ముజఫర్ ను కష్టపడి పెంచి పెద్ద చేసింది. కుమార్తెకు అమెరికా సంబధం చూసి పెళ్లి చేసి పంపించింది. అయితే మూడు నెలల క్రితం కుమారుడు ముజఫర్.. కాలాపత్తర్ కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. అందులోనూ కట్నకానుకలు ఏమీ తీస్కురాకపోవడంతో కుమారుడితో వాదించింది.
దీంతో కొడుకు ముజఫర్.. ఆమె కట్నకానుకలు ఏం తీస్కురాకపోయినా.. ఆమె ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. నెలనెలా వచ్చే జీతమంతా నీకే ఇస్తుందని చెప్పాడు. దీంతో ఆమె కాస్త చల్లబడింది. అయితే కోడలు మాత్రం నెలనెలా తనకు వచ్చే జీతాన్ని అత్తగారికి కాకుండా.. తన పుట్టింటికి అంటే తల్లిదండ్రులకు పంపిస్తోంది. విషయం తెలుసుకున్న సుల్తానా కుమారుడు, కోడల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. విషయం తెలుసుకున్న ఫర్హానా అమెరికా నుంచి కొత్త దంపతులకు ఫోన్ చేసి సర్ది చెప్పింది. వారం రోజుల పాటు మీ పుట్టింట్లోనే ఉండమని.. తాను అమ్మకు నచ్చజెబుతానని వివరించింది. ఇదే విషయమై తల్లికి ఈనెల 11వ తేదీన అమెరికా నుంచి ఫర్హానా ఫోన్ చేసింది.
అయితే తల్లి ఎంతకూ ఫోన్ లేపకపోవడంతో తమ్ముడికి ఫోన్ చేసి తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది. అదేరోజు రాత్రి ఏడున్నరకు బంధువులతో కలిసి ఇంటికెల్లి తలుపు తట్టాడు. అయినా తల్లి తలుపు తీయకపోవడంతో వెనక నుంచి వెళ్లి వంట గదిలో చూడగా.. కాలిన గాయాలతో తల్లి మృతి చెంది ఉంది. వెంటనే విషయాన్ని అమెరికాలో ఉన్న అక్కతో పాటు పోలీసులకు కూడా తెలియజేశాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఆమె కావాలనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.