అన్వేషించండి

Banjara Hills Drugs Case : డ్రగ్స్ కేసులో నాపై బురద జల్లుతున్నారు - వాళ్లని చెప్పుతో కొట్టాలి : నటి హేమ

Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ ఫుడింగ్ పబ్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఈ కేసుతో సంబంధం లేకపోయినా తన పేరు వాడుతున్నారని నటి హేమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Banjara Hills Drugs Case : హైదరాబాద్(Hyderabad) బంజారాహిల్స్ ఫుడింగ్ పబ్ లో డ్రగ్స్(Drugs ) వాడకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ డ్రగ్స్ పార్టీలో పలువురు ప్రముఖుల(Celebraties) పిల్లలు ఉన్నారు. మాజీ ఎంపీ కుమారుడు, సినీనటుడు కుమార్తెతో సహా ప్రముఖ సింగర్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వారు డ్రగ్స్ వినియోగించారా లేదా అని విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ కేసులో సినీ నటి హేమ(Actress Hema) పేరును కొన్ని వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎటువంటి సంబంధంలేని కేసులో తన పేరు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్ పీఎస్ కు వచ్చిన హేమ తనపై వస్తున్న వార్తలపై ఫిర్యాదు చేశారు. తాను పబ్ లో లేకపోయినా ఉన్నట్లు వార్తలు వచ్చాయని ఆవేదన చెందారు. తనపై తప్పుడు వార్తలు రాసిన ఓ న్యూస్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని హేమ ఫిర్యాదు చేశారు. 

డ్రగ్స్ వాడిన వాళ్లని చెప్పుతో కొట్టాలి

"హైదరాబాద్ లో డ్రగ్స్ లేకుండా చేయాలి. సినిమా వాళ్లు ఫోకస్ అవుతారు కాబట్టే మాపై బురదజల్లుతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలి. డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం(TS Govt) చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. డ్రగ్స్ వాడిన వాళ్లని చెప్పుతో కొట్టాలి.  డ్రగ్స్ అంటే సినిమా వాళ్లు ఫోకస్ అవుతారు. చిన్న పిల్లలు దగ్గర నుంచి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు.  వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను." అని నటి హేమ అన్నారు. 

గల్లా అశోక్ కి ఎటువంటి సంబంధం లేదు 

శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్(Galla Ashok) పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  

శాంపిల్స్ సేకరించిన పోలీసులు 

బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 150 మంది యువతీ యువకుల ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. పోలీసులు రైడ్స్ కు వెళ్లిన సమయంలో డ్రగ్స్ ప్యాకెట్లు కిటికీ నుంచి బయటకు పారేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ డ్రగ్స్ ఎవరు వాడేరనే కోణంలో విచారణ చేస్తున్నారు. 150 మంది యువతీ యువకులు ఇంటి అడ్రస్ లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రముఖుల పిల్లలతో పాటు మరి కొందరి శాంపిల్స్ కు పోలీసులు సేకరించారు. డ్రగ్స్ దొరికిన రూంలో ప్రముఖుల పిల్లల ఉండటంపై అనుమానాలు రేకెత్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget