Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు
Naresh Pavitra Lokesh : సినీ నటులు నరేష్, పవిత్ర లోకేశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు.
Naresh Pavitra Lokesh : సినీ నటులు నరేష్, పవిత్ర లోకేశ్ లు కొన్ని వెబ్ సైట్స్ , యూట్యూబ్ ఛానల్స్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పట్ల అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
తమ పర్సనల్ విషయాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని నరేష్, పవిత్రా లోకేశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల నుంచి నరేష్, పవిత్రా లోకేశ్ రిలేషన్ పై పుకార్లు షికారు చేశాయి. వారి మధ్య అనుబంధం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పలువురు వెబ్ సైట్లు వార్తలు రాశాయి. ఇటీవల ఓ హోటల్ రూమ్ లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
నరేష్, పవిత్ర లోకేశ్ కలిసి ఇటీవల పలు చిత్రాల్లో పనిచేశారు. ఈ చిత్రాల ప్రమోషన్ లో ఇద్దరూ పాల్గొన్నారు. అలాగా కృష్ణ అంత్యక్రియల సమయంలో పవిత్ర లోకేశ్ కూడా ఉండడంతో వీరి రిలేషన్ మరిన్ని వార్తలు వచ్చాయి. నరేష్, పవిత్ర లోకేశ్ గురించి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. దీంతో నరేష్, పవిత్ర లోకేశ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు వీరు ఫిర్యాదు చేశారు. కొన్ని టీవీ ఛానెల్స్, యూట్యూబర్స్ తమను లక్ష్యం చేసుకొని అభ్యంతరకర పోస్టులు, వార్తలు పెడుతున్నారని, తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొన్ని లింక్స్ ను ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పవిత్ర మంచి స్నేహితురాలు
పవిత్ర లోకేశ్ తో రిలేషన్ గురించి నరేష్ మాట్లాడుతూ ఆమె తనకు మంచి స్నేహితురాలని చెప్పారు. ఆమెతో కలిసి నాలుగైదు సినిమాలు చేశానని అన్నారు. ఆమెపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన మీడియాపై మండిపడ్డారు నరేష్. జనాలకు అన్యాయం జరుగుతున్న విషయాలపై స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలని.. అంతేకానీ ఒకరి పర్సనల్ లైఫ్ మీద చేయడం తప్పని అన్నారు. పవిత్ర లోకేశ్ పై తనకు అభిమానం, గౌరవం ఉన్నాయని నరేష్ అన్నారు. తను డిప్రెషన్ తో బాధపడుతున్న సమయంలో పవిత్ర సపోర్ట్ గా నిలిచిందని.. అలాంటి సమయంలో ఒక ఫ్రెండ్ అవసరం ఉందని పవిత్ర తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. తనకు చాలా మంది స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారని.. అందులో పవిత్ర ఒకరని చెప్పారు. కృష్ణ ఫ్యామిలీ కూడా తనకు రెస్పెక్ట్ ఇస్తుందని అన్నారు.