News
News
X

Naveen Murder Case : నవీన్, హరిహరకృష్ణ ఫోన్లు ఎక్కడ? హత్య వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు

Naveen Murder Case : నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై రేపు తదుపరి విచారణ జరగనుంది.

FOLLOW US: 
Share:

Naveen Murder Case : హైదరాబాద్ శివారులో నవీన్‌ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణను 8 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. నవీన్‌ హత్య జరిగిన ఘటనా స్థలాన్ని నిందితుడితో కలిసి పరిశీలించాల్సి ఉందని పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఈ హత్య వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. నవీన్‌ ఫోన్ పగలగొట్టిన హరిహర కృష్ణ దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పడేశాడని, అది ఎక్కడో  తెలుసుకోవాల్సి ఉందన్నారు పోలీసులు. నిందితుడు హరిహర కృష్ణ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్ లో పోలీసులు తెలిపారు. ఫోన్‌ను ఎక్కడ దాచాడనే విషయాన్ని హరిహర కృష్ణను విచారించాల్సి ఉందన్నారు. పోలీసు కస్టడీ పిటిషన్‌పై బుధవారం వాదనలు అనంతరం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

హరిహర కృష్ణ స్నేహితుడ్ని విచారించిన పోలీసులు 

నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ ను పోలీసులు విచారించారు. హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు. హత్య జరిగిన తర్వాత హరిహర కృష్ణ ఏంచేశాడో హసన్ ను విచారించారు పోలీసులు. బ్రాహ్మణపల్లిలోని రాజీవ్ గృహకల్పలో ఉంటున్న హసన్‌ ఇంటికి హరిహరకృష్ణ వెళ్లాడు. అక్కడ రక్తపు మరకలు అంటిన డ్రస్ విప్పేసి హసన్‌ దుస్తులు వేసుకున్నాడు హరిహరకృష్ణ. రక్తపు మరకల గురించి అడగగా,  నవీన్‌ను హత్యచేసినట్టు హరిహరకృష్ణ చెప్పినట్టు హసన్‌ పోలీసులకు చెప్పాడు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని నవీన్ ను హత్య చేసినట్టు హరిహర కృష్ణ చెప్పాడని హసన్ స్టేట్మెంట్ ఇచ్చాడు.    

రిమాండ్ రిపోర్టులో సంచలనాలు

తన లవర్ తో క్లోజ్ గా ఉంటున్నాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఇటీవల హైదరాబాద్ లో సంచలనం అయింది. నవీన్ హత్య రిమాండ్ రిపోర్టర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రేమకి అడ్డున్నాడనే నవీన్ ను హత్య చేసినట్లు హరిహర కృష్ణ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మూడునెలల ముందే హత్యకు స్కెచ్ వేసినట్లు వెల్లడించారు. రెండునెలల క్రితం మలక్ పేట్ సూపర్ మార్కెట్ లో హరిహర కృష్ణ కత్తి కొనుగోలు చేశాడు. ఈనెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ హత్య చేశాడు. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో నవీన్, హరిహర కృష్ణ మద్యం తాగారు. మద్యం మత్తులో యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఓఆర్ఆర్ సమీపంలో నిర్మాణుష్య ప్రాంతంలో నవీన్ గొంతునులిమి హత్య చేశాడు హరిహర కృష్ణ. ఆ తర్వాత కత్తితో శరీరాన్ని విడిభాగాలుగా చేశాడు.  తల, వేళ్లు, ఇతర శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు హరిహర కృష్ణ. బ్రాహ్మణ పల్లి నిర్మాణుష్య ప్రదేశంలో ఆ బ్యాగును పడేసిన నిందితుడు హరిహర కృష్ణ. 

తిరిగొచ్చి శరీరవిడిభాగాలు సేకరించి దహనం 

"అనంతరం పక్కనే ఉన్న ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లాడు హరిహరకృష్ణ. స్నానం చేసి డ్రస్ చేంజ్ చేసుకొని హత్య విషయాన్ని హసన్ చెప్పాడు. మరుసటి రోయు ప్రియురాలికి సైతం హత్య విషయం చెప్పాడు నిందితుడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నానికి పరారయ్యాడు. ఈ నెల 24న తిరిగి హైదరాబాద్ కు చేరుకొని హత్య స్పాట్ కు వెళ్లాడు. శరీర విడి భాగాలు సేకరించి వాటిని దహనం చేశాడు. 24 సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు." అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

Published at : 28 Feb 2023 09:25 PM (IST) Tags: Hyderabad Crime Naveen Murder Abdullapurment Hariharakrishna

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak SIT : గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127, 122 మార్కులు- మరో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్టు!

TSPSC Paper Leak SIT : గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127, 122 మార్కులు- మరో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్టు!

Kakinada Crime : గ్రామ దేవత జాతరలో కాలు తొక్కాడని గొడవ, ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి!

Kakinada Crime : గ్రామ దేవత జాతరలో కాలు తొక్కాడని గొడవ, ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి!

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Honour Killing Chittoor: ఇష్టం లేకుండా కుమార్తెను పెళ్లి చేసుకున్న అల్లుడిపై మామ పగ- నడిరోడ్డుపై కిరాతకంగా హత్య

Honour Killing Chittoor: ఇష్టం లేకుండా కుమార్తెను పెళ్లి చేసుకున్న అల్లుడిపై మామ పగ- నడిరోడ్డుపై కిరాతకంగా హత్య

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు