అన్వేషించండి

Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?

How to Kill Men and Get Away With It: మహిళలు ఇటీవల ప్రియుళ్లను, భర్తలను ఘోరంగా చంపుతున్న నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దొరకకుండా మగవాళ్లను చంపడం ఎలా అనే పుస్తకం ట్రెండింగ్ లోకి వచ్చింది

Psychological Thrillers Trending 2026:  ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంచలన నేరాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మగవాళ్లను మహిళలు దారుణంగా చంపేస్తున్నారు. ఇటీవల కేతన్ అగర్వాల్ ను సియాగోయల్ చంపేసిన అంశం సంచలనంగా మారింది.   క్రమంలో  బ్రిటీష్ జర్నలిస్ట్, రచయిత్రి క్యాటీ బ్రెంట్   రాసిన సైకలాజికల్ థ్రిల్లర్ నవల  "How to Kill Men and Get Away With It" సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. 2022 చివర్లో విడుదలైన ఈ   నవల, ప్రస్తుత సమాజంలోని కొన్ని రియల్ క్రైమ్ ఇన్సిడెంట్స్ కారణంగా నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదొక డార్క్ హ్యూమర్ , మైండ్ గేమ్‌లతో కూడిన థ్రిల్లర్ అయినప్పటికీ.. పుస్తకం టైటిల్ , అందులోని ప్రధాన కథాంశం ప్రస్తుత క్రైమ్ ట్రెండ్స్‌కు అద్దం పడుతుండటంతో బుక్ లవర్స్ దీనిపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.

అనుకోకుండా మొదలైన ‘మర్డర్ అడిక్షన్’! 

 ఈ కథ అంతా కిట్టి కొల్లిన్స్  అనే ఒక గ్లామరస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చుట్టూ తిరుగుతుంది. ధనిక కుటుంబానికి చెందిన కిట్టి, ఒక రాత్రి నైట్‌క్లబ్ నుండి వస్తుండగా తనను వేధిస్తూ వెంబడించిన ఒక వికృత చేష్టల వ్యక్తిని  ఆత్మరక్షణ కోసం నెట్టేయడంతో అతను అనుకోకుండా చనిపోతాడు. అయితే, ఆ ఘోరమైన తప్పు నుండి ఆమె చాలా సులభంగా తప్పించుకుంటుంది. అక్కడి నుండి కిట్టి కొల్లిన్స్ ఆలోచనా సరళి పూర్తిగా మారిపోతుంది. సమాజంలో మహిళలను వేధించే, అత్యాచారాలకు పాల్పడే,  దారుణాలకు ఒడిగట్టే క్రూరులైన మగవారిని ఏరిపారేయడమే తన  నిజమైన బాధ్యత  అని భావించి.. ఆమె ఒక సీరియల్ కిల్లర్‌గా మారుతుంది.
 
 నవ్వుతూనే భయపెట్టే డార్క్ హ్యూమర్! 

ఈ పుస్తకానికి లభించిన సమీక్షల్లో అత్యధిక మంది దీనిని హాలీవుడ్ క్లాసిక్ అమెరికన్ సైకో ,  కిల్లింగ్ ఈవ్ సిరీస్‌లతో పోల్చారు. సమాజంలో నేరస్థులను మాత్రమే ఏరివేసే పాపులర్ క్యారెక్టర్  డెస్టర్  కి ఇదొక మహిళా వర్షన్ లాంటిదని రివ్యూవర్లు పేర్కొన్నారు. క్యాటీ బ్రెంట్ ఈ నవలను చాలా పదునైన, వ్యంగ్యాస్త్రాలతో కూడిన శైలిలో రాశారు. ఒకవైపు కిట్టి కొల్లిన్స్ లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఐటీ గర్ల్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు తన తండ్రికి చెందిన మాంసం వ్యాపార పరిశ్రమలను ఉపయోగించి శవాలను ఎలా మాయం చేస్తుందనేది అత్యంత థ్రిల్లింగ్‌గా, కొన్ని చోట్ల నవ్వించేలా, మరికొన్ని చోట్ల వెన్నులో వణుకు పుట్టించేలా పుస్తకంలో వర్ణించారు.
 
 సామాజిక కోణంలో చర్చ! 

కేవలం ఒక రొటీన్ క్రైమ్ స్టోరీలా కాకుండా.. ఈ నవల సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న అధికార సమతుల్యత  , మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల తీవ్రతను ప్రశ్నిస్తుంది. చట్టం తన పని తాను చేయనప్పుడు, నేరస్థులు యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు.. ఒక సాధారణ మహిళ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వచ్చే పరిణామాలు ఏంటనే చారిత్రాత్మక కోణాన్ని ఈ సైకలాజికల్ థ్రిల్లర్ టచ్ చేస్తుంది.  
 
 దేశీయ నేరాల కారణంగా వైరల్ 

ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న కొన్ని దారుణమైన మర్డర్ కేసులు, పగ ప్రతీకారాలతో భాగస్వాములను చంపుకుంటున్న ఘటనలు వార్తల్లో నిలుస్తుండటంతో.. నేటి తరం నెటిజన్లు ఇలాంటి సైకో-థ్రిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. హౌ టు కిల్ మెన్ అండ్ గెట్ అవే విత్ ఇట్ అనే టైటిల్ చూసి ఇది నిజంగానే మగవారిని చంపే గైడ్ బుక్ అనుకుంటే పొరపాటే.. ఇదొక కల్పిత సోషల్ సెటైర్ నవల మాత్రమే. అయినప్పటికీ, ఒక నేరస్థుడిని చంపి ఎలా సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవాలనే ఉత్కంఠభరితమైన ట్విస్టులు, షార్ట్ చాప్టర్లతో సాగే క్యాటీ బ్రెంట్ రచన.. ప్రస్తుత క్రైమ్ మైండ్ సెట్‌లను అర్థం చేసుకోవడానికి రీడర్లను తెగ ఆకర్షిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget