IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Sharapova Schumacher fraud : షరపోవా, షూమాకర్‌లపై ఢిల్లీలో చీటింగ్ కేసు ! ఆ స్పోర్ట్స్ స్టార్లు ఇంత చీటర్లా ?

ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తాము షరపోవా, షూమాకర్ పేర్లతో టవర్లు నిర్మిస్తామని చెప్పి బుకింగ్‌లు చేయించుకుంది. కానీ ఎగ్గొట్టింది. దీంతో ఇప్పుడు షరపోవా, షూమాకర్లపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 

మారియా షరపోవా గురించి తెలియని వారు తక్కువ. ఎవరు అంటే ఎవరికి తెలిసినట్లుగా వారు టెన్నిస్ స్టార్‌ అని లేకపోతే అందగత్తె అని.. సూపర్ మోడల్ అని చెబుతారు. అంతే కానీ ఎవరూ చీటర్ అని చెప్పరు. అలాగే మైకేల్ షూమాకర్ ఎవరు అంటే.. ఫార్ములా వన్ రేసర్ అని తెలిసిన వాళ్లు అయినా చెబుతారు.. తెలియని వాళ్లు తెలియదని చెబుతారు. కానీ చీటర్ అని చెప్పరు. కానీ వీరిద్దర్నీ చీటర్లని చెబుతున్నారు ఢిల్లీకి చెందిన షెఫాలి అగర్వాల్ అనే మహిళ. అంతే కాదు.. ఆమె వారిపై న్యాయపోరాటం చేసి కేసులు కూడా పెట్టించారు. అందుకే ఈ విషయం ఇప్పుడు ఇంటర్నేషనల్ హాట్ టాపిక్ అయింది. అసలు వారు ఇండియాకు ఎప్పుడు వచ్చారు ? ఎలా షెఫాలి అగర్వాల్‌ను చీటింగ్ చేశారు ? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్సే.

ఢిల్లీలో రియల్‌టెక్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌ అనే సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. అందులో ఆరేడు టవర్లు కట్టాలనుకున్నారు. అందులో ఒక టవర్‌కు షరపోవా అని పేరు పెట్టింది. మరో టవర్‌కు మైకేల్ షూమాకర్ పేరు పెట్టింది. ఈ పేర్లు నచ్చాయో.. లేకపోతే టవర్లు నచ్చాయో కానీ.. ఓ ఫ్లాట్‌ను షెఫాలీ అగర్వాల్ బుక్ చేసుకున్నారు. డబ్బులు కట్టారు. కానీ  షరపోవా, షూమాకర్ టవర్లు మాత్రం రెడీ కాలేదు. ఒప్పందం ప్రకారం 2016కి పూర్తి కావాలి. కానీ కాలేదు. దీంతో ఆమె న్యాయపోరాటం ప్రారంభించారు. 

గుర్గావ్‌లోని సెక్టార్ 73లో షరపోవా పేరు మీద ఉన్న ప్రాజెక్ట్‌లో తాను, తన భర్త రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నామని, అయితే డెవలపర్ కంపెనీలు తమ ప్రాజెక్ట్‌లో భాగంగా డబ్బు వసూలు చేశారని.. చివరకు ఫ్లాట్‌ను సిద్దం చేయకుండా తమను మోసం చేశాయంటూ కోర్టులో పేర్కొంది. తాము ప్రాజెక్ట్ గురించి ప్రకటనల ద్వారా తెలుసుకున్నామని.. ప్రాజెక్ట్ చిత్రాలు, వాగ్దానాలు చూసి కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి మోసపోయామని ఆమె కోర్టులో వాదించారు.  కోర్టు కూడా ఆమె వాదనను  కేసులు పెట్టాల్సిందేనని ఆదేశించింది. దీంతో గురుగ్రామ్ పోలీసులు మారియా షరపోవా, మైకేల్ షూమాకర్‌లపై కూడా కేసులు పెట్టారు. 

అయితే ఆ ఇంటర్నేషనల్ స్టార్‌ల ఇద్దరి పేర్లు ఉన్నంత మాత్రానే కేసు పెట్టలేదు..నిజంగానే ఆ ప్రాజెక్టుకు వారుప్రచారం చేశారని షెఫాలి అగర్వాల్ చెబుతున్నారు. షరపోవా ప్రత్యేకంగా విందు సమావేశానికి వచ్చి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో టెన్నిక్ అకాడమీ పెడతానని హామీ కూడా ఇచ్చారట. అందే కాదు.. షరపోవా సైతం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కంపెనీ గురించి ప్రస్తావించిందని చెబుతున్నారు. డబ్బుల కోసం ట్వీట్లు.. పోస్ట్‌లు  చేయడం సెలబ్రిటీలు సహజంగానే చేస్తూంటారు. అలాగే షరపోవా, షూమాకర్ కూడా చేసి ఉంటారు. కానీ ఇప్పుడు వారు అడ్డంగా ఇరుక్కుపోయారు. 

Published at : 17 Mar 2022 03:04 PM (IST) Tags: Cheating Case Sharapova Maria Sharapova Mike Schumacher cheating case against sports stars in Delhi

సంబంధిత కథనాలు

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Kakinada News :  డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు,  పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా