అన్వేషించండి
Advertisement
Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు
Actor Sai Kiran : తన దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని మోసం చేశారని సినీ నటుడు సాయి కిరణ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్మాత జాన్ బాబు, లివింగ్ స్టెన్ పై సాయి కిరణ్ ఫిర్యాదు చేశారు.
Actor Sai Kiran : సినీ నటుడు, నువ్వే కావాలి సినిమా ఫేమ్, గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి తండ్రిగా నటించిన సాయి కిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన దగ్గరు అప్పు తీసుకుని మోసం చేసిన నిర్మాత జాన్ బాబు, లివింగ్ స్టెన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరుతో రూ. 10.6 లక్షలు వసూలు చేసినట్లు సాయి కిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సాయి కిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయి కిరణ్ ఫిర్యాదుతో జాన్ బాబు, లివింగ్ స్టెన్ లపై 420, 406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. సాయి కిరణ్ నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తు్న్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion