News
News
X

Crime News : ఐదో పెళ్లికి దొరికిపోయాడు - ఇప్పుడూ అందరూ కలిసి

గుంటూరులో ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఎన్నారై మోసగాడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నిత్యపెళ్లి కొడుకు ఘోరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

FOLLOW US: 

Crime News  :  గుంటూరు జిల్లాలో ఏడాదికో పెళ్లి చేసుకుని మహిళ్లని వంచిస్తున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఎన్నారై. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని తనను ఐదో పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు ఐదో భార్య చేసిన ఫిర్యాదు చేశారు.  సతీష్ కు ఇంతకు ముందే పెళ్లి అయి విడాకులు తీసుకున్నాడని… మంచివాడని బెంగుళూరులో తెలిసిన వాళ్లు చెప్పగా పెళ్లి కుదుర్చుకున్నట్లు ఐదో భార్య తెలిపింది. అయితే ఇలా పెళ్లిళ్లు చేసుకోవడం ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఆయన స్టైల్ అని తెలియడంతో పోలీసుల్ని ఆశ్రయించింది. 

జూన్ 16న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగిందని. జూలై 2న సతీష్ వ్యవహారం అనుమానం వచ్చి గూగుల్ లో సెర్చ్ చేయగా అతని బండారం బయటపడిందని ఆమె తెలిపింది. అన్ని ఆధారాలు సేకరించి దిశపోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు సతీష్ బాబును, అతని తండ్రి వీరభద్రరావును అరెస్ట్ చేశారు. సతీష్ పై గతంలోనే రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.  కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి  14రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు నిందితుడిని జిల్లా జైలుకు తరలించారు.

ర్నాటి సతీష్​బాబు లండన్‌లో ఎంబీఎ చదివి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఏడాదిలో ఒకటి, రెండు నెలలు ఇక్కడకు వస్తాడు. ఇంతలో విజయవాడలో ఉన్న అతని తల్లిదండ్రులు 46 ఏళ్ల వయసున్న తమ కుమారుడిని అందంగా ఫొటోలు తీసి పెళ్లి చూపులకు సిద్ధం చేస్తారు. మా కుమారుడు ఎన్‌ఆర్‌ఐ...పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని అమెరికా తీసుకువెళతాడంటూ నమ్మించి రూ.లక్షల్లో కట్నకానుకలు, వందల గ్రాముల బంగారాన్ని తీసుకొని వివాహం చేస్తారు. అధికమొత్తంలో కట్నకానుకలు ఇచ్చేవాళ్లని తెలిస్తే రెండో సంబంధం అమ్మాయిలైనా ఓకే చెప్పేసి తాళి కట్టేస్తాడు.

ఇతగాడికి బట్టతల కావడంతో ఆవిషయం బయటపడకుండా విగ్గుపెట్టి నమ్మించే యత్నం చేస్తాడు. పెళ్లిపీటలపై జిలకర్రబెల్లం పెట్టే క్రమంలో యువతి గుర్తిస్తే తనకు కొద్దిరోజుల కిందట చర్మవ్యాధి రావడంతో జుట్టు ఊడిపోయిందని త్వరలో వచ్చేస్తుందంటాడు. పెళ్లి చేసుకొని అందమైన భవంతిలో సకలభోగాలతో నెల, రెండు నెలలు కాపురం చేస్తాడు. ఆ మహిళల వీడియోలు చరవాణిలో తీసుకుంటాడు. అమ్మాయి అభ్యంతరం చెబితే మాయమాటలు చెప్పి తాను అమెరికా వెళ్లినప్పుడు ఈ గుర్తులు చూసుకోవడానికంటూ ఏమార్చుతాడు. ఆ తర్వాత అమెరికా చెక్కేస్తాడు. ఈ క్రమంలో కొందరు మహిళలు అతని గురించి తెలుసుకొని ప్రశ్నిస్తే డబ్బులిచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకుంటాడు. పట్టుబట్టిన వారికి విడాకులు ఇచ్చేస్తాడు. చివరికి పాపం పండటంతో అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. 

Published at : 28 Jul 2022 08:17 PM (IST) Tags: Crime News guntur crime news Nitya Pelli Son NRI Karnati Satish

సంబంధిత కథనాలు

టీచర్‌తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !

టీచర్‌తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో  జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

టాప్ స్టోరీస్

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!