By: ABP Desam | Updated at : 05 Feb 2022 10:05 AM (IST)
నిందితురాలు
రోజు కూలి పనులు చేసుకుని జీవనం సాగించే కూలీలపై మాయలేడి కన్నుపడింది. తన వద్ద ఉన్న డాలర్లు మారితే రూ.10 వేల పెట్టుబడికి రూ.లక్ష ఇస్తానంటూ మాయమాటలు చెప్పింది. అలా 60 లక్షల వరకు వసూలు చేసింది. అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ ఇచ్చి మోసపోయామని తెలియడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. గుంటూరు జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది.
పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ నగర్ చెందిన మరియమ్మ అనే మహిళకు పేరేచర్ల గ్రామానికి చెందిన షేక్ నబి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన షేక్ నబి తన వద్ద డాలర్లు ఉన్నాయని అది మార్చడానికి కొంత నగదు కావాలని మరియమ్మకు చెప్పింది. డాలర్లు మారిన వెంటనే రూ.10 వేలు ఇచ్చిన వారికి రూ.లక్ష రూపాయలు చెల్లిస్తాను అంటూ నమ్మపలికింది. నిజమని భావించిన మరియమ్మ ఆశతో తన వద్ద ఉన్న నగదు, వడ్డీకి మరికొంతసొమ్ము మొత్తం రూ.పది లక్షలు మాయాలేడి నబికి ఇచ్చింది. మరికొంత నగదు కూడా సర్దుబాటు చేస్తే తన వద్ద ఉన్న మొత్తం డాలర్లు మార్చవచ్చని మరియమ్మకు చెప్పి నమ్మించింది.
మరియమ్మ తనకు తెలిసిన బంధువులు, తుమ్మలచెరువు, బ్రాహ్మణపల్లి, పిల్లుట్ల గ్రామాలలో తనకు పరిచయం ఉన్న వారికి విషయం తెలిపింది. అత్యాశకుపోయి వారు కూడా మాయలేడి నబి ఉచ్చులో పడ్డారు. ఇలా 300 మందికి పైగా నబికి సుమారు రూ.60 లక్షల వరకు అప్పగించినట్లు బాధితులు తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇవాళ రేపు అంటూ నెలలు గడపడంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. మాయలేడి మకాం మార్చి ఎక్కడకో వెళ్ళిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. మూడు రోజుల క్రితం నబి పిడుగురాళ్ళ పట్టణానికి వచ్చింది.
ఈ సంగతి తెలిసి మరియమ్మతోపాటు బాధితులంతా నబిని నిలదీశాడు. డాలర్ల విషయం అందరికీ చెప్పారని అందువల్ల డాలర్లు ఎక్స్‌ఛేంజ్ చేసుకొనే వారు తీసుకోవడం లేదని అందుకు కారణం మీరే అంటూ మాయలేడి నబి బాధితులపై రివర్స్ ఎటాక్ చేసింది. మీకు నేను నయాపైసా కూడా ఇవ్వను మీకు చేతనైనది చేసుకోండని బాధితులను బెదిరించింది. దిక్కుతోచని స్థితిలో బాధితులు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పట్టణ సీఐ మధుసూదన్ రావు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
చిలుక జోస్యం కాదు- సాక్ష్యం చెప్పింది- నిందితులకు శిక్ష పడింది
Hyderabad fire accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం - వ్యక్తి సజీవదహనం
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం